/rtv/media/media_files/2025/05/04/6uHCythUqFq8epuInqvh.jpg)
Daughter in law
అత్తాకోడళ్లు తల్లి కోడళ్లు ఎప్పటికీ కాలేరు. అత్త ఎంత ప్రేమగా ఉన్న కూడా ఎప్పటికి తల్లి కాదు. అలాగే కోడలు అత్తను ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా కూతురు కాలేదు. అయితే అత్తాకోడళ్ల మధ్య ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. వీరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే తప్పకుండా పాటించాల్సిన ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
అర్థం చేసుకోండి
అత్తాకోడళ్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అన్ని పనులు పంచుకుంటే అసలు ఇద్దరి మధ్య గొడవలు రావు. అమ్మతో చిన్న గొడవ జరిగితే వెంటనే మాట్లాడేస్తారు. అదే పెద్ద గొడవ అత్తతో జరిగితే అసలు మాట్లాడరు. దీనివల్ల సమస్య పెరిగి.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇలా వదిలేయకుండా ఇద్దరు కలిసి సమస్య ఏంటో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.
ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
భర్తకు చెప్పవద్దు
కొందరు భార్యలు ప్రతీ విషయాన్ని భర్తలకు చెబుతుంటారు. అలాగే కోడలు చిన్న తప్పు చేస్తే చాలు అత్త కొడుక్కి చెబుతుంది. ఇలా ఫిర్యాదులు ఇవ్వడం వల్ల గొడవలు వస్తాయి. ఇలా ఒకరి తప్పులను ఒకరు చెప్పుకోకుండా.. అర్థం చేసుకోవాలి. అప్పుడే బంధం కూడా స్ట్రాంగ్ అవుతుంది.
ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
నెగిటివ్‌గా థింక్ చేయవద్దు
కొందరు ప్రతీ విషయాన్ని నెగిటివ్‌గా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఇతరులు ఏం చెబుతున్నారో కూడా సరిగ్గా ఆలోచించలేరు. అత్త లేదా కోడలు మంచి చేసినా కూడా నెగిటివ్‌గా చూడటం వల్ల తప్పుగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త పాజిటివ్‌గా చూడటం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!
తల్లిదండ్రుల వలె..
తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో.. అత్త మామలను కూడా అలాగే చూసుకోండి. అలాగే అత్తలు కూడా కోడలిని కూతురు వలె చూసుకుంటేనే మంచిది. అప్పుడే అత్తా కోడళ్ల మధ్య బంధం బలపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
daughter-in-law | latest-telugu-news | husband | wife