Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..

వృశ్చిక రాశి వారికి నేడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయికన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.అలాగే మిగిలిని రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో ...

New Update
Zodiac Signs: ఈ 4 రాశుల వారిని అందరు ఇష్టపడతారు!

మేష రాశి వారు నేడు ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.

Also Read: Ajit Pawar: దొంగకు అది సైఫ్‌ అలీఖాన్‌ ఇల్లు అని తెలీదు: అజిత్‌ పవార్‌

వృషభ రాశి వారు ఈరోజు  ఓ మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు.

మిథున రాశి వారు నేడు  వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

Also Read: Rahul Gandhi: బిహార్‌ కులగణన ఫేక్ అన్న రాహుల్‌.. స్పందించిన ఎన్డీయే

కర్కాటక రాశి వారు  వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు.

సింహ రాశి వారు నేడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనవ్యయం తప్పదు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

కన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి వారికి ఈరోజు  కొన్ని ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.

శ్రమకు తగిన ప్రతిఫలం...

వృశ్చిక రాశి వారికి  ఆర్థిక ఇబ్బందులు దూరమవతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

ధనుస్సు రాశి వారికి  కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయడాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది.

మకర రాశి వారికి నేడు కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

కుంభ రాశి వారికి ఈరోజు  బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.

మీన రాశి వారికి ఈరోజు అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

Also Read: Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారం నేడే..వాషింగ్టన్‌ చేరుకున్న కొత్త అధ్యక్షుడు

Also Read: Neeraj Chopra: సైలెంట్‌ గా పెళ్లి చేసుకున్న ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత నీరజ్‌ చోప్రా...అమ్మాయి ఎవరో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు