/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అంటే భారతకాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.దీని కోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు సైనిక విమానంలో చేరుకున్నారు.
Also Read: Trump swearing-in ceremony: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?
నాలుగు సంవత్సరాల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతి పై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీటిన విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు.
Also Read: BIG BREAKING: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!
రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టే సమయంలో కూడా ఇలాగే చేశారు. 40 ఏళ్ల తరువాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ కు చేరుకున్నారు.
పగ్గాలు చేపట్టిన మొదటిరోజే....
తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తంఅవుతున్నాయి. పగ్గాలు చేపట్టిన మొదటిరోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం,ట్రాన్స్ జెండర్ల హక్కులు కాలరాయడం,చమురు వెలికితీత పెంచడం క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలిరోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్‌జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15 వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది.
పలు దేశాల పై అదనపు సుంకాల విధింపు పైనా నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నారు. బైడెన్ అధ్యక్షుడైన తొలివారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
Also Read: Ajit Pawar: దొంగకు అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్