Rahul Gandhi: బిహార్‌ కులగణన ఫేక్ అన్న రాహుల్‌.. స్పందించిన ఎన్డీయే

కులగణను విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్డీయే.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటివరకు కులగణను ప్రశంసించిన రాహుల్.. ఇప్పుడు అది ఫేక్ అని చెప్పడం విడ్డూరమని పేర్కొంది.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

బిహార్‌లో నితీశ్‌ కుమార్ ప్రభుత్వం గతంలో కులగణన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కులగణను విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్డీయే.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటివరకు బిహార్‌లో జరిగిన కులగణను ప్రశంసించిన రాహుల్.. ఇప్పుడు అది ఫేక్ అని చెప్పడం విడ్డూరమని తెలిపింది. గతంలో ఇండియా కూటమి సమావేశాలు జరిగినప్పుడు నితీశ్‌ కుమార్ ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు రాహుల్ సైలంట్‌గా ఉన్నారంటూ విమర్శించింది.  

Also Read: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. ఇదిలాఉండగా.. శనివారం రాహుల్ గాంధీ బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తాం. 2022-23లో బిహార్‌లో నిర్వహించిన విధంగా ఈ ప్రక్రియ నకిలీగా ఉండదని'' రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలోనే ఎన్డీయే.. రాహల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. 

Also Read: 'నా కొడుకుకి మరణశిక్ష విధించండి': సంజయ్ రాయ్ తల్లి

బిహార్‌లో కులగణన సర్వే పూర్తయ్యాక 2023 అక్టోబర్‌లో కులగణన వివరాలు వెల్లడయ్యాయి. అప్పుడు నితీశ్ కుమార్ ఇండియా కూటమిలోనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో దళితులు, ఇతర వెనకబడిన సామాజిక వర్గాల జనాభా శాతం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. ఇదిలాఉండగా.. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా కూడా స్పందించారు. రాహుల్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తు్న్నారంటూ విమర్శించారు. బిహార్‌లో కులగణను కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చిందని మంత్రి విజయ్ కుమార్ చౌదరి అన్నారు. సర్వేలో లోపాలను ఆధారాలతో బయటపెడితే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు ఈ విమర్శలను కాంగ్రెస్‌ ఖండించింది. సర్వే అంశాలను పక్కదారి పట్టించారనే అంశాన్ని రాహుల్‌ చెప్పాలనుకున్నారని బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు.  

Advertisment
తాజా కథనాలు