World Cancer Day: ఈ ఫుడ్స్ తింటే.. క్యాన్సర్ నుంచి విముక్తి

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యమైన డైట్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. డైలీ బ్రోకలీ, నట్స్, చేపలు, కాయగూరలు వంటివి తీసుకోవాలి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

New Update
Cancer : ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణం..? కొనేటప్పుడు జాగ్రత్త.!

Cancer

ప్రపంచంలో రోజురోజుకీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల కారణంగా చాలా మంది ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. దేశంలో ఏటా కొత్తగా 15 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే క్యాన్సర్‌ను జయించాలంటే మాత్రం చికిత్స తీసుకోవడంతో కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

కాయగూరలు

క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, కాలీఫ్లవర్, బోక్ చోయ్, క్యాబేజీ, స్ప్రౌట్స్ వంటివి తీసుకోవాలి. వీటిలో క్యాన్సర్‌తో పోరాడే కారకాలు పుష్కలంగా ఉంటాయి. డైలీ వీటిని ఏదో ఒక సమయంలో తినడం వల్ల క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కాకుండా ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

చేపలు
సాల్మన్, ట్యూనా, ఆంకోవీస్ వంటి చేపల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. 

వాల్ నట్స్
ఫైబర్ ఎక్కువగా ఉండే డ్రైఫూట్స్, వాల్ నట్స్ వంటివి కూడా తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. ఇందులోని ఫైబర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే పప్పు ధాన్యాలు, బీన్స్ గింజలు వంటివి కూడా తీసుకోవాలి. 

డార్క్ చాక్లెట్ 
కోకో అధికంగా ఉండే డార్క్ చాక్లెట్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఇందులో ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల క్యాన్సర్ సమస్యలన్నీ పరార్ అవుతాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు