Health: ఈ గింజలను ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం

మొలకెత్తిన గింజలను డైలీ తింటే జీర్ణ, గుండె, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని ఫైబర్, పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Sprouts

Sprouts Photograph: (Sprouts)

మొలకెత్తిన గింజలను డైలీ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్‌ ఉంటాయి. ఇవి ఈజీగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో మొలకలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన జీరపోషకాలు అన్ని కూడా అందుతాయి.

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

సాధారణ గింజల కంటే మొలకెత్తిన..

మొలకెత్తిన గింజల్లో ఉండే ఆల్కైజెస్‌ ప్రాణాంతక‌ వ్యాధులైన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. సాధారణ గింజల కంటే మొలకెత్తిన గింజల్లోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. పెసలు, మినుమలు, శనగలు, చిక్కుడు గింజలను మొలకెత్తించి తింటేనే ఆరోగ్యానికి మంచిది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే

ఇందులోని ఫైబర్ బరువు తగ్గడానికి ఈజీగా సహాయపడుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను పచ్చిగా కాకుండా ఆవిరిలో ఉడికించి ఉదయాన్నే తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నీరసం, అలసట ఉన్న వారికి ఈ మొలకెత్తిన గింజలు బాగా ఉపయోగపడతాయి. 

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు