/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/coconut-jpg.webp)
coconut water
కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో మాత్రమే కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. మరి కొబ్బరి నీరు ఏ సమయంలో తాగడం ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.
ఏ సమయంలో అంటే?
ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. వీటిని తాగడం వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది. అలాగే బరువు అదుపులో ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొబ్బరి నీళ్లలో ఉండే మూలకాలు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఇవి పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు బాగా సహాయపడుతుంది.
ఇది కూడా చూడండి: Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం
డైలీ వీటిని ఉదయం పూట తాగడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొందరు మలబద్ధకం వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. అలాంటి వారు డైలీ తాగడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. అలాగే కొబ్బరి నీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ రోగులకు కూడా కొబ్బరి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డైలీ కొంచెం అయినా కూడా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Health Tips: తల దురద కేవలం చుండ్రు వల్లే కాదు..ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు