ఇట్టే బరువు తగ్గాలంటే.. ఈ టీ తాగాల్సిందే!

డైలీ బ్లాక్ టీ తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే గుండె పోటు, రక్తపోటు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే అతిగా తాగకూడదు.

New Update
weight loss4

weight loss

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పూర్వ కాలంలో అయితే ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గాలని ఎన్నో మందులు వంటివి వాడుతున్నారు. అయినా కూడా చాలా మందికి ఈ సమస్య తగ్గడం లేదు. ఎలాంటి మందులు లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే మాత్రం ఓ టీ తాగాలి. ఇంతకీ ఆ ఏంటి?  పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా..

ఇప్పుడంటే అందరూ ఎక్కువగా కాఫీ, టీ వంటివి తాగుతున్నారు. కానీ పూర్వ కాలంలో ఎక్కువగా బ్లాక్ టీ తాగేవారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం పూట తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి మందులు కూడా అవసరం లేదు. ఎంత లావుగా ఉన్నవారు అయినా కూడా బ్లాక్ టీ తాగితే ఈ ఇట్టే బరువు తగ్గుతారు. ఇందులోని ప్లేవనాయిడ్స్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గిస్తాయి. 

అలాగే గుండె పోటు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటను అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు బ్లాక్ టీని తాగడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. అలా అని అతిగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు