Cold Beer
Cold Beer: చాలా మంది చల్లటి బీరు తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీని వెనుక సైన్స్ ఉంది. చల్లటి బీరు ఎందుకు అంత రుచిగా ఉంటుందో మ్యాటర్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించారు. ఆల్కహాల్ పానీయాలలో నీరు, ఇథనాల్ ప్రవర్తనను పరిశోధకులు అధ్యయనం చేశారు. నీటి ఉష్ణోగ్రతను బట్టి ఇథనాల్ అణువుల రుచి మారుతున్నట్లు గుర్తించారు. తక్కువ ఉష్ణోగ్రతలు బీరు విలక్షణమైన లక్షణాలను పెంచుతాయి. ఇది చాలా మంది తాగేవారికి రుచికరంగా ఉంటుంది.
చల్లటి బీరు..
బీరులో ఉండే నీరు, ఇథనాల్ అణువులను అధ్యయనం చేస్తున్నప్పుడు వివిధ పానీయాలలో వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఇథనాల్ అణువులు నిర్దిష్ట ఆకారాలను తీసుకుంటాయని పరిశోధకులు గమనించారు. బీరు వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసినప్పుడు ఇథనాల్ అణువులు పిరమిడ్ ఆకారాన్ని సంతరించుకుంటాయి. మరోవైపు ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్న ఆల్కహాల్ పానీయాల ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉంటే వాటిలోని ఇథనాల్ అణువులు గొలుసు ఆకారంలో ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఈ రోజు నుంచి అల్పాహారంలో ఇవి ట్రై చేయండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు
ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఇథనాల్ అణువులు దగ్గరగా వస్తాయి. అందుకే చల్లటి బీరు రుచి బాగా ఉంటుంది. గొలుసు ఆకారపు అణువుల కంటే పిరమిడ్ ఆకారపు ఇథనాల్ అణువులు మరింత రిఫ్రెషింగ్ రుచిని కలిగి ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. గతంలో బీర్‌పై జరిగిన మరో పరిశోధనలో వాతావరణ మార్పు కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. వాతావరణ మార్పు బీరు రుచిని మారుస్తుందని అంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత, ఇతర కారణాలు బీరు తయారీకి ఉపయోగించే హాప్ పువ్వుల సంఖ్య, నాణ్యత తగ్గడానికి దారితీయవచ్చని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ మూడు స్మూతీలతో నెల రోజుల్లో బరువు తగ్గొచ్చు