Health Tips: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

క్లీన్ షేవ్ చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. షేవింగ్ తర్వాత.. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చర్మం జిడ్డుగా, మొటిమలకు గురవుతుంటే.. క్లీన్-షేవ్ చేసుకోవడం మంచిది. గడ్డం పెంచుకోవాలనుకుంటే దానిని శుభ్రంగా, తేమగా ఉంచడం ముఖ్యం.

New Update
Clean Shaven

Clean Shaven

 Clean Shaven vs Beard: ఈ రోజుల్లో పురుషులలో గడ్డం పెంచుకోవడం ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. అయితే.. కొంతమంది క్లీన్ షేవ్ లుక్ ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు పొడవాటి గడ్డాన్ని పురుషత్వానికి చిహ్నంగా భావిస్తారు. కానీ చర్మ ఆరోగ్యం విషయానికి వస్తే.. క్లీన్ షేవ్ చేసుకోవడం మంచిదా లేక గడ్డం ఉంచుకోవడం మంచిదా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. చర్మ సంరక్షణ ప్రకారం.. గడ్డం పెంచుకోవాలా..? వద్దా..? అని నిర్ణయించుకోవడానికి, రెండింటి ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

క్లీన్ షేవ్ వల్ల ప్రయోజనాలు:

క్లీన్ షేవింగ్ చర్మం నుంచి చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. ముఖం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది. గడ్డంలో చెమట, ధూళి పేరుకుపోవడం వల్ల మొటిమలు వచ్చేవారికి.. క్లీన్ షేవ్ చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. షేవింగ్ తర్వాత.. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటి చర్మంపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

క్లీన్ షేవ్ ప్రతికూలతలు:

తరచుగా షేవింగ్ చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు, కోతలు ఏర్పడవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు షేవింగ్ వల్ల చికాకు, ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి.. చర్మం సున్నితంగా ఉంటే క్లీన్ షేవింగ్ మానుకుంటే మంచిది. పొడవాటి గడ్డం ముఖ చర్మాన్ని దుమ్ము, ఎండ, కాలుష్యం నుంచి రక్షిస్తుంది. అంతేకాదు.. గడ్డం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీనివల్ల చర్మం పొడిగా మారదు. షేవింగ్ చేయకపోవడం వల్ల చర్మంపై చికాకులు వంటి రావు.

ఇది కూడా చదవండి: అమ్మాయిలకు చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తాయి?

గడ్డాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే.. అందులో బ్యాక్టీరియా, దుమ్ము, సెబమ్ పేరుకుపోతాయి. దీనివల్ల మొటిమలు, దురద వస్తుంది. పరిశుభ్రత పాటించకపోతే గడ్డంలో పేలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చర్మం జిడ్డుగా, మొటిమలకు గురవుతుంటే.. క్లీన్-షేవ్ చేసుకోవడం మంచిది. గడ్డం పెంచుకోవాలనుకుంటే దానిని శుభ్రంగా, తేమగా ఉంచడం ముఖ్యం. ఏ స్టైల్‌ను స్వీకరించినా.. చర్మ శుభ్రత, సరైన సంరక్షణ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కడుపులో పుండ్లు ఎందుకు వస్తాయి.. ఎలా నియంత్రించాలి?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు