/rtv/media/media_files/2025/10/11/beer-2025-10-11-14-56-41.jpg)
దేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక యూత్ అయితే ఎక్కువగా బీర్లు తాగుతూ(Drink Beer) ఉంటారు. ఏ నలుగురు కలిసిన బీరు తీసుకుని సిట్టింగ్ వేస్తూ మాట్లాడుకుంటారు. బీరులో 4% నుండి 6% ఆల్కహాల్(alcohol) ఉంటుంది. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు(health-benefits) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది బీర్ తాగేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించరు. బీర్‌ను సరైన పద్ధతిలో ఎలా తాగాలి, దాని రుచిని పూర్తిగా ఎలా ఆస్వాదించాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని తప్పులను సరిదిద్దుకుంటే బీర్ రుచి మరింత బాగుంటుంది.
చాలా మంది బీర్ సీసా నుంచి లేదా క్యాన్ నుంచే నేరుగా తాగేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. బీర్ రుచిని, సువాసనను పూర్తిగా ఆస్వాదించాలంటే దాన్ని గ్లాసులోకి పోయాలి. గ్లాసును కొద్దిగా సుమారు 45 డిగ్రీల కోణంలోవంచి, బీర్‌ను గ్లాసు అంచు వెంబడి నెమ్మదిగా పోయాలి. ఇలా పోయడం వల్ల బీర్ పైన ఒక నిలకడైన నురుగు ఏర్పడుతుంది. ఈ నురుగులో బీర్ సువాసన, గ్యాస్ దాక్కుకొని ఉంటాయి. దీనివల్ల ప్రతి సిప్‌లో బీర్ అసలు రుచి, వాసన తెలుస్తుంది.
Also Read : టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!!
నురుగు లేకుండా బీర్ తాగడం
నురుగు లేకుండా బీర్ తాగడం చాలా మంది చేసే పెద్ద తప్పు. నురుగు అనేది కార్బన్ డయాక్సైడ్ సహజంగా విడుదల కావడానికి సహాయపడుతుంది. గ్లాసులో నురుగు ఉంటే, ఆ గ్యాస్ మీ కడుపులోకి ఎక్కువగా పోకుండా చేస్తుంది, తద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
బీర్‌ను మరీ ఎక్కువగా చల్లగా తాగడం కూడా దాని రుచిని తగ్గిస్తుంది. సాధారణంగా, లైట్ లాగర్స్ కొంచెం ఎక్కువ చల్లగా (40°F - 45°F లేదా 4°C - 7°C) ఉండాలి.బీర్ మంచులా గడ్డకట్టేంత చల్లగా ఉండకూడదు, అలా ఉంటే దాని రుచి మందగిస్తుంది. సాధారణంగా బీర్‌ను గుటగుటా తాగేస్తుంటారు. అది చాలా తప్పు.. చిన్న చిన్న సిప్‌లు తీసుకుంటూ, ప్రతి సిప్‌ను నోట్లో కొద్దిసేపు ఉంచి, రుచి, సువాసన, ఆ తర్వాత వచ్చే అనుభూతిని ఆస్వాదించాలి. మీరు తాగే బీర్ రకానికి తగిన గ్లాసును ఎంచుకుంటే రుచి మరింత మెరుగవుతుంది.
Also Read : 1,2 లేదా 4.. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి..?