Artificial Intelligence: స్ట్రోక్‌కి AI ద్వారా వేగంగా చికిత్స సాధ్యమేనా?

ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురైనప్పుడు, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. AI సహాయంతో స్ట్రోక్ చికిత్స నగరాల్లో అభివృద్ధి చెందింది. ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో సత్వర చికిత్స అందించడం ద్వారా స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్న రోగులపై ప్రభావాన్ని తగ్గించవచ్చు.

New Update
Artificial Intelligence

Artificial Intelligence

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం అనేక రంగాల్లో విస్తరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. రోగిలో పెరిగిన మధుమేహం, రక్తపోటు సమస్య కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్సను సూచించే పనిని AI టెక్నాలజీ చేస్తోంది. ఒక స్ట్రోక్ పేషెంట్‌ని పరీక్షించి, చికిత్స చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడంలో, వేగవంతంగా చికిత్స చేయడంలో AI బాగా పని చేస్తోంది.ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురైనప్పుడు, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అలాంటప్పుడు రోగికి తగిన చికిత్స అందించాలి. గోల్డెన్ అవర్ సమయంలో రోగిపై స్ట్రోక్ (Stroke) ప్రభావాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అటువంటి క్లిష్ట కాలం గురించి తెలుసుకోవడం, వెంటనే చర్య తీసుకోవడం వల్ల ప్రాణాలను రక్షించవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  Defection MLAs : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....

సాంకేతికత అభివృద్ధిలో...

ఇంట్లో వృద్ధులు ఉంటే లక్షణాలను విస్మరించకుండా వెంటనే వారికి చికిత్స అందించడం చాలా అవసరం. గోల్డెన్ అవర్ అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన కీలకమైన క్షణమని నిపుణులు అంటున్నారు. పక్షవాతానికి గురైన వ్యక్తి స్కానింగ్, ఇమేజ్ రీడింగ్‌ని త్వరగా చేయగల సాంకేతికత అభివృద్ధిలో AI ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది రోగి చికిత్స ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. AI 3 దశల్లో స్ట్రోక్ చికిత్సలో సహాయపడుతుంది. మొదట రోగి ఇమేజింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఏదైనా అత్యవసర సమస్యలు ఉంటే గుర్తిస్తుంది. అప్పుడు చికిత్స అవసరమైతే వైద్యులు త్వరగా చర్య తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. చికిత్స పద్ధతిని పరిశీలిస్తే ఈ స్ట్రోక్‌ను రెండు రకాలుగా విభజించవచ్చు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

అవి రక్తస్రావం వల్ల వచ్చే హెమరేజిక్ స్ట్రోక్. రక్త ప్రసరణలో అవరోధం వల్ల ఏర్పడే ఇస్కీమిక్ స్ట్రోక్. ఈ రెండు కేసులకు సత్వర చికిత్స అవసరం. ముఖ్యంగా ఇస్కీమిక్ స్ట్రోక్ కోసం క్లాట్ కరిగించే మందులు ఉపయోగిస్తారు. ఈ తరహా సమస్యతో బాధపడే రోగికి తొలి గంటలను గోల్డెన్ అవర్ (Golden Hour) అని నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్‌కి సంబంధించిన అతి పెద్ద సవాళ్ళలో ఒకటి రోగులు ముందుగా లక్షణాలను గుర్తించకపోవడం. నిర్ణీత సమయంలో డాక్టర్‌ని సంప్రదిస్తే బయటపడవచ్చు. AI సహాయంతో స్ట్రోక్ చికిత్స నగరాల్లో అభివృద్ధి చెందింది. ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో సత్వర చికిత్స అందించడం ద్వారా స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్న రోగులపై ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. 

Also Read :  కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు