Alovera: అలోవెరా జెల్ చర్మానికి అప్లై చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

అలోవెరా జెల్‌ను డైరెక్ట్‌గా చర్మానికి అప్లై చేస్తే అలెర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని ఎంజైమ్‌లు కొందరి చర్మానికి దురద, చికాకు, మంటను కలిగిస్తాయి. కాబట్టి డైరెక్ట్‌గా చర్మానికి కలబంద జెల్‌ను అప్లై చేయకపోవడం మంచిది.

New Update
Alovera: Alovera: పొడవైన జుట్టు కోసం.. అలోవెరా హెయిర్ ప్యాక్స్

చలికాలంలో చల్లగాలి వల్ల చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా పగుళ్లు వస్తుందని కొందరు అలోవెరా జెల్ రాస్తుంటారు. అలోవెరా జెల్ చర్మానికి మంచిదని అనుకుంటారు. కానీ డైరెక్ట్‌గా చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అలోవెరాను చర్మానికి డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

అలెర్జీ వచ్చే ప్రమాదం..

ఒక్కోరి చర్మం ఒక్కోలా ఉంటుంది. కొందరి చర్మానికి కలబందలో ఉండే లాటెక్స్ పడదు. దీనివల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. డైరెక్ట్‌గా చర్మానికి కలబంద (Alovera) అప్లై చేస్తే దురద, వాపు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇందులోని ఎంజైమ్‌లు చర్మానికి చికాకును కలిగించడంతో పాటు మంటని కలిగిస్తాయి. 

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

కలబంద అప్లై చేయడం చర్మం పొడి బారకుండా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ దీనివల్ల కొందరి చర్మం పొడిబారుతుంది. చికాకుగా ఉండటంతో పాటు చర్మం ఎరుపుగా కనిపిస్తుంది. కాబట్టి పదే పదే చర్మానికి కలబంద జెల్‌ను అప్లై చేయకపోవడం మంచిది. ఒక వేళ అప్లై చేసిన కూడా ఎక్కువ సమయం ఉంచకూడదు. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయడం మంచిది. అయితే చర్మానికి మార్కెట్‌లో దొరికే కలబంద కాకుండా స్వయంగా ఇంట్లో తయారు చేసేది వాడటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు