Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే జరిగేది ఇదే

ప్రతిరోజూ మద్యం తాగే వారు ఒకేసారి తాగడం మానేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు తరచుగా నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ దశలో ఆ వ్యక్తి ప్రతిదీ మరచిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

New Update

Alcohol: అతిగా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనేది తెలిసిన విషయమే. అయితే చాలా మంది మద్యపానం మానేయ లేకపోతున్నారు. ప్రతిరోజూ తాగకపోయినా, లేదా రెండుసార్లు మద్యం తాగినా అది శరీరంలోకి ప్రవేశించి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కానీ ప్రతిరోజూ మద్యం తాగే వారు ఒకేసారి తాగడం మానేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మద్యం సేవించడం అకస్మాత్తుగా ఆపడం వల్ల శరీరానికి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే అది కొంత మందిలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొంత మందికి అలసట అనిపించవచ్చు.

మానసిక సమస్యలు కనిపిస్తాయి:

కొన్నాళ్లపాటు మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. తాగుడు మానేసిన వారిలో కూడా చాలామందికి చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. అంతేకాదు ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. సరళంగా చెప్పాలంటే వ్యసనం నుండి బయటకు వచ్చినప్పుడు సంభవించే ఒక రకమైన సిండ్రోమ్ అని నిపుణులు అంటున్నారు. చాలా సంవత్సరాలుగా మద్యం సేవిస్తున్న వ్యక్తి ఏదో ఒక కారణం చేత తాగడం మానేస్తే మూడు రోజుల్లోనే మానసిక సమస్యలు కనిపిస్తాయి. కోపం, ముందు ఏమి జరుగుతుందో తెలియని స్థితి, మాట్లాడేటప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు గందరగోళం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇది కూడా చదవండి: సిగరెట్లు తాగడం వల్ల నిజంగా మానసిక ఒత్తిడి తగ్గుతుందా?

కొంతమంది సరిగ్గా తినకుండానే పగలు, రాత్రి మద్యం తాగుతారు. అలాంటి వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారు అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు తరచుగా నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ దశలో ఆ వ్యక్తి ప్రతిదీ మరచిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం మానేయాలనుకునే వారు దానిని క్రమంగా తగ్గించుకోవాలి. నెలకు చాలా సార్లు లేదా వారానికి ఒకసారి తాగడం తగ్గించండి. అప్పుడు దానిని పూర్తిగా ఆపాలి. మద్యపానం పూర్తిగా మానేయడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అందువల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండటానికి మద్యం వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ వ్యాధుల ప్రమాదం మహిళలకు ఎక్కువగా ఉంటుంది

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు