Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి.
Feb 26, 2025 21:43 IST
పోసాని కృష్ణ మురళి అరెస్టు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోసానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు.
Posani Krishna Murali Arrest
Feb 26, 2025 18:56 IST
హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. .
Feb 26, 2025 16:45 IST
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు.
CM Revanth Reddy
Feb 26, 2025 16:44 IST
డిలీమిటేషన్ అలా చేస్తేనే మంచిది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి తగ్గట్టు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో దేశ జనాభాలో 2.8 శాతం ఉండి.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందన్నారు.
KTR Responds on Delimitation
Feb 26, 2025 15:02 IST
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన జీతాలు!
ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులను 3 వర్గాలుగా విభజించి 5 నుంచి 20 శాతం వేతనం పెంచినట్లు సమాచారం. వర్గాల వారిగా 2024 జనవరి నుంచి వేతన పెంపు వర్తించనుంది.
Feb 26, 2025 14:09 IST
National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది.
విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది. చివరి నిమిషంలో పైలెట్ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు కింది ఆర్టికల్ లో..
Chicago Airport
Feb 26, 2025 10:10 IST
Constable Suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కొహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్!
యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్ధిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
conistable sucide Photograph: (conistable sucide)
Feb 26, 2025 06:52 IST
CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీని కలవనున్నారు. నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం 10.30గంటలకు ప్రధానిని కలుస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంతో పాటూ పలు ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని సమాచారం.