/rtv/media/media_files/2025/02/26/m7FVmE1BRhQ5EZIFcdhZ.jpg)
Posani Krishna Murali Arrest
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోసానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. గతంలో పోసాని కృష్ణ మురళి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో తాజాగా ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.