USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్

విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది.  చివరి నిమిషంలో పైలెట్ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు కింది ఆర్టికల్ లో..

New Update
flight accident

Chicago Airport

అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఏమవుతుందనేది సందేహంగా మారుతోంది. వరుసపెట్టి విమాన ప్రమాదాలు అక్కడ ఆందోళనకరంగా మారాయి. జనవరిలో వాషింగ్టన్లో ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాఫ్టర్ ఢీ కొట్టుకుని నదిలో పడిపోయాయి. దీనిలో 67మంది ప్రయాణికులతో పాటూ నలుగురు సిబ్బంది, మరో నులుగురు జవాన్లు చనిపోయారు. అమెరికా చరిత్రలో ఇదో పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ గా మిగిలిపోయింది. దీని తరువాత వరుసపెట్టి నాలుగు ప్రమాదాలు జరిగాయి. వీటి వల్ల కూడా కొంత ప్రాణ నష్టం జరిగింది. అయినా కూడా ఎయిర్ ట్రాఫిక్ గురించి పట్టించుకోవడం లేదు అమెరికా ఎయిర్ పోర్టులు. మళ్ళీ మళ్ళీ విమాన ప్రమాదాలకు తావిచ్చేలా ప్రవర్తిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈరోజు అక్కడ షికాగో జరిగిన ఓ సంఘటన. 

లిప్తపాటులో తప్పిన ప్రమాదం..

షికాగో మిడ్ వే ఎయిర్ పోర్ట్ లో ఈరోజు రెండు విమానాలు ఢీ కొట్టుకోవలసింది. అయితే పెలైట్ చాకచక్యం వలన అది తృటిలో తప్పింది. ఈ రోజు ఉదయం 8.47 నిమిషాలకు సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగోకు చేరుకుంది. అక్కడి మిడ్ వే ఎయిర్ పోర్ట్ లో రన్ వే 31సీపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఆల్మోస్ట్ దాని చక్రాలు కూడా టచ్ డౌన్ అయ్యాయి. అయితే అదే సమయంలో సరిగ్గా అడ్డంగా రన్ వే మీద ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ వెళుతోంది. దాన్ని గమనించిన సౌత్ వెస్ట్ విమానం పైలెట్ దిగుతున్న విమానాన్ని వెంటనే పైకి తీసుకెళ్ళారు. రెండు ఫ్లైట్లు ఢీకొనకుండా ఇమ్మీడియట్ గా గాల్లోకి లేపారు. దీంతో చాలా పెద్ద ప్రమాదం నుంచి రెండూ బయటపడినట్టయ్యాయి. 

దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏటీఎఫ్ ఏం చేస్తోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఫెడరల్ ఏవియేషన్...ఛాలెంజర్‌ 350 బిజినెస్‌ జెట్‌ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కసారిగా రన్‌వేపై వచ్చిందని చెబుతోంది. అయినా కూడా ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. 

Also Read: USA: సంపన్న వలసదారులకు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు