Prashant Kishor: పార్టీ మారనున్న నీతీశ్ కుమార్.. బిహార్ రాజకీయాల్లో పీకే సంచలనం!
బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కూటమి మారనున్నట్లు తెలిపారు. సీఎం పదవికోసం నితీశ్ పార్టీ మారడం ఖాయమని, ఇది నిజంకాకుంటే తాను రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటానన్నారు.
bihar Photograph: (bihar)
Mar 05, 2025 12:22 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.
Mar 05, 2025 12:03 IST
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
Mar 05, 2025 11:17 IST
సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్
అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది.
Tariff War
Mar 05, 2025 10:11 IST
రాబోయే 25 ఏళ్లలో అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్!
2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతుందని, ఇండోనేషియాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్ మారబోతుందని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అలాగే హిందూ మతానికి భారత్ బలమైన కోటగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
Mar 05, 2025 09:13 IST
ఏపీలో మహిళా రైడర్లు.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Mar 05, 2025 08:04 IST
పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. ఆమె బలవన్మరణానికి కారణమేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త ప్రసాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని భర్త ప్రసాద్ చెబుతున్నారు.
singer kalpana Photograph: (singer kalpana )
Mar 05, 2025 08:04 IST
దెబ్బ మీద దెబ్బ.. పోసానికి మరో కేసులో 14 రోజులు రిమాండ్
పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 18 వరకూ రిమాండ్ విధించి, కర్నూల్ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఆధోని 3టౌన్ పోలీసులు పోసానిపై కేసు ఫైల్ చేశారు.
Mar 05, 2025 08:03 IST
కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
Mar 05, 2025 08:02 IST
బాబార్ ఆజమ్‌కు దిమ్మతిరిగే షాక్... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు బాబార్ ను కూడా బోర్డు పక్కనపెట్టింది. జట్టులో ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి.
Mar 05, 2025 08:01 IST
అప్పుడు తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Mar 05, 2025 08:00 IST
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 05వ తేదీన మొదలై 25 వ వరకు జరగనున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్, గురువారం సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.