Shama Mohamed : అప్పుడు  తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

New Update
shama, rohit

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా ఘన విజయం  సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే  కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కూడా ట్వీట్ చేశారు. అద్భుత విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ పెట్టారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచినందుకు ఈరోజు తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్

‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్‌ చేయడంతో పాటుగా ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అంటూ ఆమె తన ట్వీట్ లో  రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమెపై బీజేపీ నేతలతో పాటుగా సొంత పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది భారత్, విరాట్ కోహ్లీ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ కాగా..  భారత్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే దానిని ఛేదించింది. 

Also read : Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!

#ind vs aus #rohit-sharma #Shama Mohamed tweet #shama mahmood #india
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు