AP: కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబు!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

New Update
Naga Babu : అనకాపల్లి పార్లమెంటు నుంచి నాగబాబు పోటీ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసినప్పుడు జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయం అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. కానీ ఆయన రాష్ట్ర క్యాబినెట్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తపరిచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ భావించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. కానీ షెడ్యూల్ విడుదల అయ్యాక నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయితేనే కరెక్ట్ అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డాని తెలుస్తోంది. ఆయన సూచన మేరకు ఇప్పుడు కీలకమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిలో నియమించనున్నట్లు కూటమి వర్గాల ద్వారా చెబుతున్నాయి. 

అదైతేనే నాగబాబుకు కరెక్ట్...

రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తూ.. పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండే లాంటి కార్పొరేషన్‌కు తన అన్న న్యాయం చేస్తారని పవన్ కల్యాణ్ భావించారు. అందుకే ఛైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలించాలని చెప్పారని కూటమి వర్గాలు తెలిపాయి.  కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.  కానీ చివరకు నాగబాబు కార్పొరేషన్ ఛైర్మన్ గా సెటిల్ అవుతారని చెబుతున్నారు. 

Also Read: Virat Kohli: సొంతరికార్డుల కన్నా..జట్టు గెలవడం ముఖ్యం..కింగ్ కోహ్లీ 

Advertisment