/rtv/media/media_files/2025/03/05/NbpNnJ5ERR38LlI3By77.jpg)
రాబోయే 25 సంవత్సరాలలో అంటే2050 నాటికి.. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి సంఖ్య ఇస్లాంను అనుసరించే వారి సంఖ్యకు దాదాపు సమానంగా ఉంటుందని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఐరోపాలో రాబోయే రెండున్నర దశాబ్దాలలో ముస్లిం జనాభా మొత్తం జనాభాలో 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
Also read : అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యా.. ఒక్కదాన్నే వెళ్లి అబార్షన్ చేయించుకున్నా : కుబ్రా సైత్
ఇండోనేషియాను అధిగమించి
ఇక ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతుందని.. ఇండోనేషియాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్ మారబోతుందని అభిప్రాయపడింది. రాబోయే 25 సంవత్సరాలలో హిందూ జనాభా పెరుగుతూనే ఉండటంతో భారతదేశం హిందూ మతానికి బలమైన కోటగా ఉంటుందని కూడా నివేదిక పేర్కొంది.
కాగా ఇప్పటికే క్రైస్తవ, ఇస్లాం మతాల వారు ఎక్కువగా యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికా వంటి ఖండాలలో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. మరోవైపు హిందూ మతాల వారు ప్రధానంగా భారత్ లోనే ఉన్నారు. నేపాల్‌లో సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులున్నారు. వీరితో పాటు ఇతర దేశాలలో హిందూ జనాభా చాలా తక్కువగా ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ తన నివేదికలో ప్రపంచ మత ప్రొఫైల్ నిరంతరం మారుతూ ఉంటుందని హైలైట్ చేసింది. ఆ నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాలలో క్రైస్తవ మతం అత్యంత విస్తృతంగా అనుసరించే మతంగా ఉంటుందని తెలిపింది. అయితే ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతుందని.. ఇదే ఈ ధోరణి కొనసాగితే 2050 నాటికి ముస్లింల సంఖ్య క్రైస్తవుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అభిప్రాయపడింది. 2050 నాటికి అమెరికాలో క్రైస్తవ జనాభా తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధుల సంఖ్య మారకుండా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read : ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Also read : బందరులో ఘోరం.. గర్భిణి ప్రాణం తీసిన ఆస్పత్రి.. అసలేమైందంటే..?