BIG BREAKING: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన !.. కేంద్రం ఉత్తర్వులు
మణిపుర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
President Rule in Manipur
Feb 13, 2025 19:22 IST
Nirmala Sitharaman: రాజ్యసభలో తెలంగాణపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చలో భాగంగా తెలంగాణ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని నిలదీశారు ఎంపీ రేణుకా చౌదరి. వారికి కౌంటర్ గత 10ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి వివరించారు నిర్మలాసీతారామన్.
Nirmala Sitharaman
Feb 13, 2025 14:29 IST
MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తును వేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేశారు.
Journalist Ravi Prakash files a petition in the Mumbai High Court
Feb 13, 2025 12:32 IST
RCB కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది. 2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు రజత్ పాటిదార్.
patidar
Feb 13, 2025 11:23 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా సిట్ కు కూడా ఆయనే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు.
Liquor Scam in YCP’s Time
Feb 13, 2025 10:54 IST
బిగ్ షాక్.. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. ఎక్కడో తెలుసా!
ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కోళ్లఫారం సమీపంలో ఉంటున్న సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగా.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా.. అతడికి బర్డ్ ఫ్లూ సోకినట్లుగా తేలింది.
Feb 13, 2025 09:57 IST
వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ నాలుగు రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. సత్యవర్ధన్ ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వంశీపై కేసు నమోదయింది.
vamsi arrest
Feb 13, 2025 08:20 IST
జర్నలిస్టుల పరువు తీశారు కదరా.. రిపోర్టర్లమంటూ దందాలు.. ఏడుగురిపై కేసు బుక్
మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో అక్రమ వసూళ్లు, రిపోర్టర్లుగా చెబుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు.
Fake reporters
Feb 13, 2025 08:17 IST
మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్..
టెక్నికల్ ఇష్యూస్ వలన అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు త్వరలో భూమి మీదకు రానున్నారు. మార్చి మధ్యలో వీరిద్దరినీ వెనక్కు తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని నాసా ప్రకటించింది.
Sunitha Williams Christmas Photograph: (NASA)
Feb 13, 2025 08:02 IST
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.
vamshi
Feb 13, 2025 07:35 IST
తాగుబోతు భర్తతో విసిగిపోయి... లోన్ రికవరీ ఏజెంట్‌తో భార్య రెండో పెళ్లి.. చివరికి బిగ్ ట్విస్ట్!
బీహార్‌లోని జముయిలో తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్ర కుమారి, తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. లోన్ రికవరీ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. అది ప్రేమగా మారింది. చివరికి ఇంద్ర కుటుంబం పవన్‌పై కేసు పెట్టింది.
Drunk husband
Feb 13, 2025 07:35 IST
సర్వేలో కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఖర్గే కంటే సచిన్ పైలట్కు ఎక్కువ మార్కులు!
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కంటే సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను నడపడానికి మంచి ఎంపికగా సూచించారు. సర్వేలో,8.4 శాతం మంది పైలట్‌కు మద్దతుగా ఓటు వేయగా, 2.7 శాతం మంది మాత్రమే ఖర్గేకు ఓటేశారు.
అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు.
ladies
Feb 13, 2025 07:33 IST
మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆమె పిటిషన్ వేసింది. ఈ క్రమంలో మీరు విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కోర్టుకి లేదని అంది.
Supreme Court
Feb 13, 2025 07:33 IST
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి