Nirmala Sitharaman: రాజ్యసభలో తెలంగాణపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చలో భాగంగా తెలంగాణ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని నిలదీశారు ఎంపీ రేణుకా చౌదరి. వారికి కౌంటర్ గత 10ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి వివరించారు నిర్మలాసీతారామన్. 

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: బడ్జెట్‌‌(Budget 2025)పై రాజ్య సభ(Rajya Sabha)లో చర్చలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగాన్ని తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. 2025 బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ(Telangana)కు ఏం ఇవ్వలేదని నిర్మలాసీతారామన్‌ను ఎంపీ రేణుకా చౌదరి(MP Renuka Chaudary) నిలదీశారు. విభజన హామీలో భాగంగా కేంద్రం తెలంగాణకు ఒక్కపైసా కూడా కేటాయించలేదని, పదేళ్లుగా కేంద్రం తెలంగాణను మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. విభజన హామీలను నెరవేర్చలేదని, బయ్యారం స్టీల్ ప్లాంట్, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏమయ్యాయని కాంగ్రెస్ ఎంపీలు ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలకు నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కౌంటర్ ఇచ్చారు. 

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

తెలంగాణకు కొత్తగా 5 వందే భారత్ రైళ్లను ఇచ్చామని, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కింద రూ.5337 కోట్లు కేటాయించామని ఆమె అన్నారు. జహిరాబాద్‌లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. వరంగల్‌లో పీఎం మిత్రా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని నిర్మలాసీతారామన్ వివరించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, బీబీనగర్‌లో ఎయిమ్స్, 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. 

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!

నిజామాబాద్‌లో పసుపు బోర్డు, తెలంగాణలో 199 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశామని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ మాల పథకం కింద 4 గ్రీన్ కారిడార్లు తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు ఆమె. రాష్ట్రంలో 82 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీఎం అవాస్ యోజన్ కింద కేంద్రం 2 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిందని తెలియజేశారు. విభజన నాటికి మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ గత 10ఏళ్లుగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆర్థక శాఖమంత్రి తేల్చి చెప్పారు.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు