/rtv/media/media_files/2025/02/13/F9zoV9zECBXzVIQhMkgB.jpg)
vamshi
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుల సహాయంతో గురువారం ఉదయం వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా తీసుకెళ్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో 2025 ఫిబ్రవరి 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈ లోపు ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేయడం చర్చనీయాంశంంగా మారింది.
Also Read : భార్యతో గొడవలు.. ప్రముఖ రాపర్ ఆత్మహత్య!
Also Read : భారత నేవీలో 270 ఉద్యోగాలకు ప్రకటన..లక్ష జీతం
ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు
గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో వంశీ అనుచరులపై కూడా కేసు నమోదైంది. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడే ఉన్న కొంతమంది టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలను తగులబెట్టినట్టుగా వారిపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి వెనుక వల్లభనేని వంశీ కుట్ర ఉందని పోలీసరులు అనుమానించి నిందితుడిగా చేర్చారు.
Also Read : లేడీ దొంగలు... అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ నిలువు దోపిడీ!