🔴 LIVE BREAKINGS: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 02, 2025 12:30 IST

    కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!

    ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ తల్లి శశితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో 9 బాలుడు, 5ఏళ్ల బాలికను చార్జర్ వైరుతో చావాబాదాడు పవన్. స్థానికుల సమాచారంతో పిల్లలను ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు పోలీసులు.  

    ap crime
    ap crime Photograph: (ap crime)

     



  • Feb 02, 2025 11:41 IST

    కన్న కూతురికి చిత్రహింసలు... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే!

    పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతరిని చిత్రహింసలు పెట్టింది. ఐదురోజులుగా అన్నం పెట్టకుండా కడుపుమాడ్చడంతో పాటు కర్కశంగా అట్లకాడతో వాతలు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    Torture of the daughter
    Torture of the daughter

     



  • Feb 02, 2025 09:40 IST

    తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్‌లైన్‌ వీడియోలతో లక్షల్లో టోకరా!

    తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్‌లైన్‌లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు. 

    matka game
    matka game Photograph: (matka game)

     



  • Feb 02, 2025 09:35 IST

    కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!

    ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు.

    delhi
    Budjet, Kejriwal

     



  • Feb 02, 2025 08:30 IST

    మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!

    ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది.ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం  కాస్త ఊరటనిచ్చింది.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది.

    tax
    Incom Tax Calculater

     



  • Feb 02, 2025 08:28 IST

    నేడు సబ్ కమిటీకి కుటుంబ సర్వే నివేదిక..

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తుది నివేదికను ఈ రోజు క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అందజేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహించింది.

    Family Survey Telangana
    Family Survey Telangana

     



  • Feb 02, 2025 07:58 IST

    నేడు బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన

    శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది.

     Congress Protest on Budget
    Congress Protest on Budget

     



  • Feb 02, 2025 07:21 IST

    హరియాణాలో కాలువలోకి దూసుకెళ్ళిన జీపు..9 మంది మృతి

    హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

    Alluri District  Road Accident
    Alluri District Road Accident

     



  • Feb 02, 2025 07:20 IST

    కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు

    గుంటూరు జిల్లాలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసింది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లుగా తేలడంతో ఈ చర్యలు తీసుకుంది సీబీఐ.

    guntur
    CBI Raids On K.L university

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు