/rtv/media/media_files/2025/02/02/1qGRAKf3FtYF8PJQKLoW.jpg)
CBI Raids On K.L university
నిన్న రాత్రి సీబీఐ గుంటూరులో ఉన్న కేఎల్ యూనివర్శిటీ మీద దాడులు చేసింది. విశ్వవిద్యాలయానికి ‘ఏ ++’ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యంపైన, తీసుకున్న సభ్యులపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 14 మందిని నిందితులుగా గుర్తించింది. కేఎల్ వర్శిటీ ప్రెసిడెంట్ తో పాటూ ఇతర కాలేజీ యాజమాన్యం, న్యాక్ బృందంలో పదిమందిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. ఇందులో దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన అధ్యాపకులూ ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు నిన్న విజయవాడ గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ పరిపాలన భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సోదాలు జరిగాయి.
కేఎల్ వర్శిటీ లంచాలను నగదు, బంగారం, సెల్ ఫోన్లు.. ల్యాప్ ట్యాప్‌ల రూపంలో ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి రూ. 37 లక్షలు, 6 ల్యాప్ ట్యాప్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటూ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.
నిందితులు వీరే..
కేఎల్ యూనివర్శిటీలో తనిఖీలు వెంటనే సీబీఐ బృందం పదిమందిని అరెస్ట్ చేసింది. మరికొంత మంది కేసులు నమోదు చేసింది. దీనిలో కేఎల్ యూనివర్శిటీ యాజమాన్య ప్రతినిధులు జి.పి.సారథి వర్మ, వైస్ ఛాన్స్‌లర్, కేఎల్‌ఈఎఫ్, కోనేరు రాజ హరీన్, వైస్ ప్రెసిడెంట్, కేఎల్‌ఈఎఫ్, ఎ.రామకృష్ణ, డైరెక్టర్, కేఎల్‌యూ, హైదరాబాద్ క్యాంపస్ ఉన్నారు. వీరితో పాటూ న్యాక్ బృందంలో సభ్యులుగా ఉన్న.. సమరేంద్ర నాథ్ సాహ, ఛైర్మన్, న్యాక్ తనిఖీ బృందం, వీసీ, రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం, రాజీవ్ సిజిరియా, ప్రొఫెసర్, జేఎన్‌యూ, దిల్లీ, న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త, డా.డి.గోపాల్, డీన్, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా., రాజేశ్ సింగ్‌పవర్, డీన్, జగ్రాన్ లేక్ సిటీ విశ్వవిద్యాలయం, భోపాల్, మానస్ కుమార్ మిశ్రా, డైరెక్టర్, జీఎల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, గాయత్రి దేవరాజ, ప్రొఫెసర్, దేవనగరి విశ్వవిద్యాలయం, డా.బులు మహారాణా, ప్రొఫెసర్, సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం ఉన్నారు. వీరే కాకుండా ఇందులో ప్రధాన నిందితులుగా..ఏ1: కోనేరు సత్యనారాయణ, ప్రెసిడెంట్, కేఎల్‌ఈఎఫ్, ఏ5: డా.ఎల్.మంజునాథరావు, మాజీ డిప్యూటీ సలహాదారు, న్యాక్, ఏ6: ఎం.హనుమంతప్ప, ప్రొఫెసర్, డైరెక్టర్, బెంగళూరు విశ్వవిద్యాలయం, ఏ7: ఎం.శ్యామ్‌సుందర్, సలహాదారు, న్యాక్, బెంగళూరు లపై కేసు నమోదు చేశారు.
Also Read: GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..