పోలీసులకు ఊహించని షాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
సైఫ్ పై దాడి కేసులో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. విచారణలో భాగంగా సైఫ్ ఇంట్లో వేలిముద్రలు సేకరించిన పోలీసులకు అవి నిందితుడి వేలిముద్రలతో సరిపోలడం లేదని తేలింది. అవి షరీఫుల్ వేలిముద్రలు కాకపోతే ఇందులో మరో వ్యక్తి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
saif case updates Photograph: (saif case updates )
Jan 26, 2025 12:17 IST
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు.
auto, lorry Photograph: (auto, lorry )
Jan 26, 2025 12:17 IST
అదిరిపోయిందిగా... విజయ్ 69 మూవీ టైటిల్ ఫిక్స్!
హీరో విజయ్ నటించనున్న చివరి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. జన నాయగన్ టైటిల్ తో మూవీ తెరకెక్కబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ తన అభిమానులతో సెల్ఫీని క్యాప్చర్ చేస్తూ ఉన్నట్లుగా చూపించారు.
vijay 69 movie Photograph: (vijay 69 movie )
Jan 26, 2025 12:16 IST
NEET UG 2025 పరీక్ష పై ఎన్టీఏ కీలక ప్రకటన.. ఇకపై ప్రశ్నాపత్రం అలాగే ఉంటుంది!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG 2025 పరీక్ష పేపర్ ప్యాటర్న్ కి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. NEET UG 2025 పరీక్ష పేపర్ ప్యాటర్న్ ఇకపై ఫార్మాట్ లోకి మారుస్తున్నట్లు అభ్యర్థలుకు తెలియజేసింది.
NEET UG 2025:
Jan 26, 2025 11:39 IST
రాష్ట్రంలో పెరిగిన చికెన్ ధర.. ఇవాళ కిలో ఎంతంటే?
చికెన్ ప్రియులకు నేడు గట్టి షాక్ తగిలింది. భారీగా చికెన్ ధరలు పెరిగాయి. ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోనే పలుకుతోంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి.
Chicken prices increased in Telangana Today Photograph: (Chicken prices increased in Telangana Today )
Jan 26, 2025 11:17 IST
ఖడ్గం పెట్టిన భయం.. తుపాకీతో శ్రీకాంత్, అండర్ గ్రౌండ్ లోకి కృష్ణవంశీ
ఖడ్గం సినిమా విడుదలైన టైమ్ లోశ్రీకాంత్, కృష్ణవంశీలకి చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఎక్కడ చంపేస్తారో అని భయపడి కృష్ణవంశీ వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారట. ఇక హీరో శ్రీకాంత్ లైసెన్స్ గన్ పట్టుకుని బయట తిరిగేవారట.
వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని ఫ్రిజ్జులో దాచి
ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిజ్జులో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిజ్జు కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
mp crime Photograph: (mp crime )
Jan 26, 2025 11:15 IST
ఇన్‌స్టా రీల్స్ అదే పనిగా చూస్తే బీపీ పెరిగి చ*స్తారు.. ఫ్రూఫ్ ఇదిగో!
సోషల్ మీడియాలో అదేపనిగా రీల్స్ చూడడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రాత్రుళ్ళు ఎక్కువగా రీల్స్ చూసేవారు అధిక రక్తపోటు, హైపర్టెన్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో తేలింది.
watching reels side effects
Jan 26, 2025 07:54 IST
606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది.
TS Government Meeting
Jan 26, 2025 07:53 IST
ఇంటర్నెట్‌లో వెతికి, వెబ్‌సిరీస్‌లు చూసి.. మీర్ పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
మాధవి డెడ్ బాడీని ఎలా మాయం చేయాలని గురుమూర్తి ఇంటర్నెట్‌లో వెతికి గతంలో ఇదే తరహాలో వచ్చిన వెబ్‌సిరీస్‌లను చూశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికేశాడు. మాధవి తలను వేరుచేసి మొండేన్ని ముక్కలుగా చేశాడు. వేడినీటిలో ఆ ముక్కల్ని ఉడికించి స్టవ్ మీద కాల్చాడు.
అయ్యో ఎంత విసిగిపోయారో.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు: వీడియో వైరల్!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు పరస్పరం పెళ్లి చేసుకున్నారు. భర్తల మద్యపాన, వేధిపుల కారణంగా విసిగిపోయిన వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Gorakhpur Women Marry Each Other At Temple
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి