/rtv/media/media_files/2025/01/26/CrD5xVc2KE0mH4jjYdZp.jpg)
Chicken prices increased in Telangana Today
చికెన్ ప్రియులకు గట్టి షాక్ తగిలింది. భారీగా చికెన్ ధరలు పెరిగాయి. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు అన్నీ మూసివేయాలని ఆదేశాలున్నాయి. కానీ చాలా చోట్ల షాపులు తెరిచే ఉన్నాయి.
Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
దానికి తోడు నేడు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చికెన్ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో భారీగా మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
గతవారం కంటే ఎక్కువే
గత వారం వరకు కిలో చికెన్ ధర రూ.230 నుంచి 240 వరకు ఉండేది. కానీ ఆ ధరలు అన్నీ మారిపోయాయి. ఇవాళ మాత్రం భారీగా పెరిగిపోయాయి. గత వారం కంటే ఈ వారం రూ.50 నుంచి 60 వరకు ధరలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.250 ధర మాత్రమే ఉంది.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.280 నుంచి 300కు చేరింది. దీంతో చికెన్ ప్రియులకు ఇదొక గట్టి షాకే అని చెప్పాలి.
Also Read: Vijaya Sai Reddy: ''మేము అంగీకరించం, కానీ''.. విజయసాయి రెడ్డి నిర్ణయంపై స్పందించిన వైసీపీ