/rtv/media/media_files/2025/01/26/5hld6bji9pqWDVKycOk4.jpg)
df4d13eb-4271-415c-87ee-eee140117dcb Photograph: (df4d13eb-4271-415c-87ee-eee140117dcb)
మీర్ పేట్ మర్డర్ కేసులో రోజుకో కొత్తకోణం బయటపడుతుంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన గురుమూర్తి(Guru Murthy) తన భార్య మాధవిని(Madhavi) అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. మాధవిని చంపిన అత్తమామలకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో, దీనికి తోడు పోలీసులతో భయం.. దీంతో ఏం చేయాలో తెలియక డెడ్ బాడీని ఎలా మాయం చేయాలని గురుమూర్తి ఇంటర్నెట్‌లో వెతకడం స్టార్ట్ చేశాడు. గతంలో ఇదే తరహాలో వచ్చిన వెబ్‌సిరీస్‌లను చూశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికేశాడు. ముందుగా హ్యాక్సా బ్లేడుతో మాధవి తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత బకెట్‌లో వేడినీటిలో ఆ ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు.
ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పక్కింటిలోకి దుర్వాసన రాకుండా ఉండేందుకు కొన్ని లిక్విడ్స్ చల్లాడు. ఇలా రాత్రినుంచి సాయంత్రం వరకూ ఇదే పని మీద ఉన్న గురుమూర్తి ఆనంతరం వాటిని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తన అత్తమామలకు ఫోన్ చేసి మాధవి కనిపించడం లేదంటూ సమాచారం అందించాడు. అల్లుడి మీద అనుమానంతో మాధవి తల్లిదండ్రులు గురుమూర్తిపై కేసు పెట్టారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేయగా గురుమూర్తి పలుమార్లు కవర్లతో తరుచుగా బయటకు వెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా గురుమూర్తి చివరికి నిజం ఒప్పుకున్నాడు. ఫోరెన్సిక్, క్లూస్‌టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ల్యాబ్ కు పంపించి విశ్లేషిస్తున్నారు. ఇవన్ని మాధవివేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిస్సి్ంగ్ కేసును కేసును హత్యకేసుగా మార్చి అతడ్ని నిందితుడిగా చేర్చారు పోలీసులు.
వెంకటమాధవితో పెళ్లి
గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు.
Also Read : పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష-సీఎం రేవంత్ రెడ్డి