/rtv/media/media_files/2025/01/26/NBvVOaHYFRARp8WFqwGv.jpg)
saif case updates Photograph: (saif case updates )
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా సైఫ్ ఇంట్లో నిందితుడి వేలిముద్రలు సేకరించిన పోలీసులు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని కేసు దర్యాప్తులో తేలింది. సైఫ్ అలీఖాన్ ఇంటిలో దొరికిన వేలిముద్రలను ముంబై పోలీసులు రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID), వేలిముద్ర బ్యూరోకు పంపారు. షరీఫుల్ ప్రింట్‌లతో సరిపోలడం లేదని సీఐడీ నివేదిక నిర్ధారించింది. వేలిముద్ర టెస్టు రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని ముంబై పోలీసులకు సీఐడీ వర్గాలు సమాచారం అందించాయి. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమూనాలను సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీకి పంపినట్లుగా తెలుస్తోంది. అవి షరీఫుల్ వేలిముద్రలు కాకపోతే ఇందులో మరోవ్యక్తి సహకారం ఉండే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ.. బాలయ్య కొడుకు ఎమోషనల్..
ఇదిలావుంటే నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి తన కొడుకు కాదంటున్నారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి.. తన కుమారుడు సరిగ్గా ఒకే పోలికలతో ఉండడం వల్లనే తన కుమారుడిని అక్రమంగా ఈ కేసులో ఇరికించాలని పోలీసులు ప్లా్న్ చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. ఈ క్రమంలో షెహజాద్ కు ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి పోలీసులు కోర్టు అనుమతి కోరారు. ఇక షరీఫుల్ విచారరణకు సహకరించడం లేదంటూ పోలీసులు బాద్రాకోర్టుకు వెల్లడించారు.
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని శరణ్ హోసింగ్ సొసైటిలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి దుండగుడు చొరబడి చోరీకి యత్నించాడు. ఆ క్రమంలో అతడిని సైఫ్ ప్రతిఘటించారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో సైఫ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ మెడ, వీపులో కత్తిలో పొడిచాడు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆ క్రమంలో బిగ్గరగా అరవడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే సైఫ్‌ను కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అతడికి వైద్యులు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించి మంగళవారం డిశ్చార్జ్ చేశారు.