/rtv/media/media_files/2025/01/26/xEKIcOhtT8s0OBTcRv3i.jpg)
vijay 69 movie Photograph: (vijay 69 movie )
తమిళ హీరో విజయ్ దళపతి (Thalapathy Vijay) నటించనున్న చివరి సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా ఈ విషయాన్ని హీరో విజయ్ తన సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించాడు. జన నాయగన్ టైటిల్ తో మూవీ తెరకెక్కబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ తన అభిమానులతో సెల్ఫీని క్యాప్చర్ చేస్తూ ఉన్నట్లుగా చూపించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు ఇది రీమేక్.
Also Read : పెరిగిన చికెన్ ధర.. ఇవాళ కిలో ఎంతంటే?
Also Read : వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిజ్జులో దాచి
Jana Nayagan - Vijay Thalapathy
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025
హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మే నెల ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. 2026 పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. TVK పార్టీని స్థాపించిన విజయ్ ఓ సందేశాత్మక చిత్రంతో సినీ కెరీర్ కు ముగింపు పలకాలని చూస్తున్నారు. బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, నరేన్, తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. అయితే, నటుడిగా ఎంతో స్టార్ డం తెచ్చుకున్న హీరో విజయ్ పొలిటికల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే. ప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మంచి చేస్తూ వస్తున్నారు విజయ్. స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరద బాధితులకు సహాయం చేయడం వంటి పనులు చేశారు.
Also Read : ప్రముఖ దర్శకుడు మృతి.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ!
Also Read : మా నాన్న బతికుంటే బాగుండేది.. అజిత్ ఎమోషనల్!