Road Accident: వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు.

New Update
auto, lorry

auto, lorry Photograph: (auto, lorry )

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూమునూరు వద్ద లారీ, ఆటోలు ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు. లారీ డ్రైవర్ తాగిన మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ నుఅదుపులోకి తీసుకున్నారు.  ప్రమాద కారణంగా ఆటోలు రెండు  నుజ్జునుజ్జు అయిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  ప్రమాదస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read :  వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్లో దాచి

Advertisment
తాజా కథనాలు