/rtv/media/media_files/2025/01/26/1rKBnH90JXIiGDnHbNSW.jpg)
krishna vamsi, khadgam Photograph: (krishna vamsi, khadgam)
దేశభక్తి ఇతి వృత్తంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఉత్తేజ్, సత్యానంద్ కథనం, మాటలు రాశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య 2002 నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఐదు నంది పురస్కారాలను అందుకుంది. ఆగస్టు 15, జనవరి 26వ తేదీలలో కచ్చితంగా ఈ సినిమా టీవీలలో టెలికాస్ట్ అవుతుంది.
శ్రీకాంత్ కు కూడా బెదిరింపులు
అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ. ఈ సినిమా విడుదలైన టైమ్ లో కృష్ణ వంశీకి చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయట. తల, మొండం వేరు చేస్తామని బెదిరించారట. తనని ఎక్కడ చంపేస్తారో అని భయపడి కృష్ణవంశీ వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారట.ఇక హీరో శ్రీకాంత్ కు కూడా బెదిరించారట. కొన్ని రోజులు పాటు లైసెన్స్ గన్ పట్టుకుని బయట తిరిగారట శ్రీకాంత్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
1993లో ముంబైలో జరిగిన ఆధారంగా ఖడ్గం సినిమా స్టోరీని రాసుకున్నారు కృష్ణ వంశీ. సింధూరం తర్వాత ఈ సినిమాను చేయాలని అనుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ లతో ఈ సినిమాను చేయాలని అనుకుంటే కమర్షియల్ హంగులు అడ్డొస్తాయని శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ లతో చేశారు. శ్రీకాంత్ ను కాకుండా మరో స్టా్ర్ ను తీసుకుందామని నిర్మాత సుంకర మధుమురళి అంటే అవసరమైతే నిర్మాతనే మార్చేస్తాను కానీ శ్రీకాంత్ ను తీసేయనని తెగేసి చెప్పారట కృష్ణ వంశీ. వాస్తవానికి ఈ సినిమాను అన్ సీజన్ లో రిలీజ్ చేయడం మైనస్. లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా ఇది.
Also Read : దండోరా ఉద్యమం నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు.. మందకృష్ణ పోరాట ప్రస్థానం ఇదే!