/rtv/media/media_files/2025/01/26/p01ypbJyyt6F2XbbdeV7.jpg)
Gorakhpur Women Marry Each Other At Temple
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచ నలుమూలల నుంచి ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి జరిగింది.. ఇలా ప్రతీ విషయం వీడియో, ఫొటోలతో బయటకు వస్తున్నాయి. అందులో కొన్ని నవ్వించేవి అయితే మరికొన్ని ఏడిపించేవి.. ఇంకొన్ని ఆశ్చర్యపరిచేవి. మొత్తంగా ఏ సమాచారం అయినా వైరల్ అయిపోతుంది. అలాంటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది.
Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.
ఇద్దరు మహిళలు పరస్పరం పెళ్లిచేసుకున్నారు. అవునండీ మీరు విన్నది నిజమే. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన వారి స్నేహం.. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది. అయితే అందుకు కూడా ఓ బలమైన కారణం ఉందండోయ్. అది మరేదో కాదు భర్తల వేధింపులే అసలైన కారణం. తాగుబోతు భర్తల వేధింపులు తాళలేక ఆ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుని కొత్త జంటగా అవతరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
यह ख़बर UP के देवरिया से है, जहां रुद्रपुर स्थित दुग्धेश्वरनाथ मंदिर में दो महिलाओं ने आपस में शादी कर ली। 🌈💍🙏
— Sapna Singhania🇳🇪 (@sfsnewdelhi) January 24, 2025
इन महिलाओं का कहना है कि इनके पति इन्हें सताते थे और दारू पीकर परेशान करते थे। 6 साल पहले Instagram के माध्यम से संपर्क में आने के बाद, दोनों के बीच प्यार हो गया।… pic.twitter.com/tKMbyeaXSC
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
ఒక్కటైన ఇద్దరు మహిళలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గుంజా అలియాస్ బబ్లూ, కవిత అనే మహిళలు ముందుగా అనుకున్నట్లుగానే గురువారం పెళ్లి చేసుకున్నారు. దేవరియాలోని శివాలయంలో వీరు ఒక్కటయ్యారు. వీరిద్దరికి మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే అప్పటికే వీరికి పెళ్లైయి భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపులకు విసిగిపోయి ఉన్నారు.
అందులోనూ ఈ ఇద్దరు మహిళలు గృహహింస బాధితులు కావడంతో భర్తలను విడిచిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో గుంజా అలియాస్ బబ్లూ వరుడిగా మారిది. అనంతరం కవితను పెళ్లి చేసుకుంది. గుడిలో దండలు మార్చుకుని.. ఏడడుగులు నడిచారు. గుంజా మాట్లాడుతూ.. ప్రేమ, శాంతితో కూడిన జీవితాన్ని గడపాలని తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.