-
Jan 11, 2025 14:09 IST
పండుగకు రైలులో ఊరెళ్లే వారికి బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC!
సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్‌సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది.
-
Jan 11, 2025 09:34 IST
చెర్రీని తొక్కేసిన బన్నీ..!
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో మెగా VS అల్లు ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. పుష్ప రికార్డులకు గేమ్ ఛేంజర్ చాలా దూరంలో ఉందని. మెగా VS అల్లు ఫైట్ లో బన్నీనే గెలిచాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
-
Jan 11, 2025 08:05 IST
పొంగల్ దోపిడీ : రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ షురూ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు.
-
Jan 11, 2025 07:30 IST
గరికపాటి సంచలన నిర్ణయం... ఆమెపై పరువు నష్టం దావా!
గరికపాటిపై సంచలన వాఖ్యలు చేసిన కామేశ్వరిపై పరువు నష్టం దావాతో పాటుగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గరికపాటిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లుగా వెల్లడించింది.
-
Jan 10, 2025 10:43 IST
ఏ టిక్కెట్ కైనా ఒకటే యాప్..''మీ యాప్'' ని ప్రారంభించిన మంత్రి!
ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు..పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను ఈ యాప్ తో పొందచ్చన్నారు.
Also Read : https://rtvlive.com/telangana/minister-sridhar-babu-launches-mee-ticket-app-8606502
-
Jan 10, 2025 09:46 IST
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది.
-
Jan 10, 2025 07:53 IST
తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి ద్వారాలు తెరుచుకున్నాయి. అర్థరాత్రి 12:05 గంటల సమయంలో అర్చకులు బంగారు వాకిలి తలుపులను తెరిచారు. ఆ తర్వాత పూజలు చేసి, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షణగా స్వామి వారి గర్భాలయానికి చేరుకున్నారు.
-
Jan 10, 2025 07:48 IST
సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
-
Jan 10, 2025 07:42 IST
గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ..
🔴 LIVE BREAKINGS: పండుగకు రైలులో ఊరెళ్లే వారికి బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC!
New Update
తాజా కథనాలు