Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది.

New Update
Supreme Court

Supreme Court

స్వలింగ సంపర్కులపైన సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పు విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా.. ఎలాంటి మార్పులు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని, వారికి చట్ట బద్ధత లేదని, ఇప్పుడున్న చట్టాల ప్రకారం అది కుదరని తెలిపింది.

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, కలిసి జీవించవచ్చని స్పష్టం చేసింది. చట్టంలో ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం అది కేవలం పార్లమెంట్ ద్వారా మాత్రమే జరగుతుందని వెల్లడించింది. అలాగే స్వలింగ వివాహం చేసుకున్న జంటలు.. పిల్లలను దత్తత తీసుకునే హక్కు కూడా లేదని తెలిపింది. 

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

గతంలో తీర్పు..

స్వలింగ వివాహాలపై 2023 అక్టోబర్‌లో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని ఐదుగురు సభ్యుల బెంచ్‌లో 3-2 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. 

Advertisment
తాజా కథనాలు