IRCTC: అసలే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అంతేకాకుండా కొన్నిప్రైవేట్ కంపెనీలు వారు రెండవ శనివారం ,ఆదివారం రావడంతో సొంతూర్లకు,బయట ప్రదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ మరోసారి పనిచేయకపోవడంతో టికెట్లు బుక్ చేసుకోవడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: Lal Bahadur Shastri లాల్ బహుదర్ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ! IRCTC వెబ్‌సైట్‌ను తెరిచినప్పుడు, టికెట్ బుకింగ్, రద్దు గంట వరకు అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.నిజానికి, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఒక నెలలో మూడోసారి పనిచేయకపోవడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..! IRCTC పనిచేయడం లేదని.. తత్కాల్ బుకింగ్ సమయంలో, ప్రజలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు IRCTC వెబ్‌సైట్ డౌన్ అయింది. వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది. సమాచారం ప్రకారం, ఉదయం 10:50 గంటలకు IRCTC పనిచేయడం లేదని ప్రజలకు ఫిర్యాదులు వచ్చాయి. తక్షణ టిక్కెట్ బుకింగ్, వెబ్‌సైట్, యాప్‌లో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. IRCTC వెబ్‌సైట్ టికెట్ బుకింగ్‌కే కాకుండా టికెట్ స్టేటస్, PNR వంటి వాటిని తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. Also Read: Maha Kumbamela 2025: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే! Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?