TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.

New Update
accident (1)1

Big Breaking: సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read: Tirumalaకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు

టైరు పేలడంతో..

ట్రావెల్స్ బస్సు ఖమ్మం మీదుగా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌  వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైరు పేలడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 

Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్

వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.

Also Read: TS: గ్రామ పంచాయతీల ఉద్యోగులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త!

Also Read: Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు