ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య సరస్వతుల కామేశ్వరి సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గరికపాటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై ఆమె చేసిన దుష్ప్రచారాన్ని చట్టం ప్రకారం ఎదురుకోవడానికి సిద్ధమైనట్లుగా ఆయన టీమ్ వెల్లడించింది. కామేశ్వరిపై పరువు నష్టం దావాతో పాటుగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా గరికపాటిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లుగా వెల్లడించింది. దీనిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంపై గరికపాటి అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందరాదని ఆయన టీమ్ పేర్కొంది. garikapati team Photograph: (garikapati team) కామేశ్వరి సంచలన ఆరోపణలు గరికపాటి నరసింహారావుపై ఇటీవల కామేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. గరికపాటి ఓ నీచుడని.. ఆయన పేరు తలుచుకున్నే పాపమేనంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్దారు. 25 ఏళ్ల తనను రాక్షసుడిలా ఏడిపించాడంటూ కామేశ్వరి ఆరోపణలు చేశారు. గరికపాటికి నీతి లేదని.. ఖ్యాతి కోసం పాకులాడుతాడని మండిపడ్డారు. ఆడది అంటే గరికపాటికి చాలా అలుసంటూ చెప్పుకొచ్చారు కామేశ్వరి. తన పిల్లల కోసమే గరికపాటి పాతిక సంవత్సరాలు భరించానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గరికపాటి రెండేళ్లు చిన్నవాడు గరికపాటి తనకంటే రెండేళ్లు చిన్నవాడని.. తన పచ్చటి సంసారాన్ని కూల్చి తనను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ తెలిపారు. వాలి,సుగ్రీవుడి కథ చెప్పినందుకు తనపై క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు. తన మీద, తన కొడుకుతోనే క్రిమినల్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్‌కు లాగుతారా అని మండిపడ్దారు. గరికపాటి పెట్టె హింసలు బయటకి చెప్పేవి కాదని తెలిపారు కామేశ్వరి. గరికపాటి రెండో భార్య శారదా చాలా మంచిదని చెప్పుకొచ్చారు. కాగా కామేశ్వరితో విడిపోయి శారదను రెండో పెళ్లి చేసుకున్న గరికపాటి.. పిల్లల బాధ్యతను ఆయనే తీసుకున్నారు. అయితే కామేశ్వరి చేసిన కామెంట్స్ పై గరికపాటి టీమ్ ఇప్పటికే స్పందించింది. గరికపాటిపై వస్తున్న ఆరోపణలను నిరాధారం, సత్యదూరమని ఆయన టీమ్ పేర్కొంది. తాజాగా ఇదే విషయంలో కామేశ్వరికి నోటీసుల జారీ చేసింది. Also read : హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్ కు బేషరతు విడుదల