ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలు..? ఆర్టీసీ, మెట్రో టికెట్లు..తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు..పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను..క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క క్లిక్ తో పొందొచ్చు. Also Read: CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్! మీ సేవ రూపొందించిన ఈ యాప్ లో బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానికస్ సర్వీసెస్ డెలివరీ రూపొందించిన ఈ మీ టికెట్ యాప్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఒకే ప్లాట్‌ఫాం పైకి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని రకాల టికెట్ ల బుకింగ్‌ను ఒకే ప్లాట్‌ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా యాప్ ను రూపొందించాం. దీని ద్వారా తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీకి సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. Also Read: Tirupati Stampede: తప్పు జరిగింది.. క్షమించండి: తిరుపతిలో పవన్ ఎమోషనల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే..ఆ సమాచారం కూడా యాప్ లో కనిపిస్తుంది. దీన్ని సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయోచ్చు. అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. మల్సూర్ వంటి వారు ఉన్నారు. Also Read: Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్! Also Read: Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా