/rtv/media/media_files/2025/11/14/congress-wins-jubilee-hills-bye-poll-2025-11-14-15-28-05.jpg)
Congress wins Jubilee Hills bye-poll, KTR Responds
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీవ్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్‌ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని.. మరింత బలంగా పనిచేస్తామని, కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు పోరాడుతామని వ్యాఖ్యనించారు. ''ఈ ఉపఎన్నికలు మా పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చింది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం BRS పార్టేనని ప్రజలు తీర్పునిచ్చారు. ప్రజా సమస్యలపై మా పార్టీ పోరాటం కొనసాగుతుంది.
Also Read: ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యుత్.. తేజస్వీకి షాక్ ఇచ్చిన బీహారీలు
మాగంటి సునీతకు రాజకీయం అనుభవం లేకపోయిన ఆమె ఈ ఎన్నికల కోసం ఎంతో కష్టపడ్డారు. గత రెండేళ్ల నుంచి బీఆర్‌ఎస్ బలమైన విపక్ష పాత్రను పోషిస్తోంది. ఈ ఎన్నికల్లో మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఓవైపు ప్రజాక్షేత్రం మరోవైపు సోషల్ మీడియాలో మేము పనిచేస్తున్నాం.2014 నుంచి 2023 వరకు ఏడు ఉపఎన్నికలు జరిగాయి. కానీ కాంగ్రెస్ ఒక్క బై ఎలక్షన్‌లో గెలవలేదు. మేము ఐదు స్థానాల్లో గెలిచి రెండు స్థానాల్లో ఓడిపోయాం.
LIVE: BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/Rnd7KCSuLL
— BRS Party (@BRSparty) November 14, 2025
ఈ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల తరఫున మా వాదనను బలంగా వినిపించాం. కుల, మత రాజకీయాలను, అసభ్య పదజాలాన్ని వాడలేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌కు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు అందించాం. జాతీయ స్థాయిలో చూసుకుంటే బీహార్‌లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. జూబ్లీహిల్స్‌లో దొంగఓట్ల గురించి ఆధారాలు చూపించాం. పోలింగ్ రోజే మా అభ్యర్థి వాళ్లను పట్టుకున్నారు. దీనిపై చర్చ జరగాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బెంగాల్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. తెలంగాణలో కూడా పది చోట్ల ఉపఎన్నికలు జరగాల్సిందేనని'' కేటీఆర్ అన్నారు.
Follow Us