Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎన్నిక(Jubilee Hills assembly election 2025)ల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(congress naveen yadav) విజయం సాధించారు. సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయనకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు...
భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం. భారీ మెజారిటీతో నన్ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారు.ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చెయ్యను.BRS గెలిచిన సమయంలో కక్ష పూరిత రాజకీయాలు చేశారు. నేను అలాంటి రాజకీయాలు చెయ్యను.అందరిని కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు.
Also Read : ఇకనైనా మారండి.. జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం సంచలన ప్రెస్ మీట్!
Naveen Yadav Key Comments After Victory
‘‘ నా విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు అని నవీన్ అన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. ఈ రోజుతో ఎన్నికలు ముగిశాయి. అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం. భారత రాష్ట్రసమితి నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ పార్టీ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని ఎద్దేవా చేశారు. కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని BRS చూసిందన్నారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా’’ అని నవీన్ తెలిపారు.
నేను అందరిని కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మన ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీస్కొని వెళ్తా. అభివృద్ధే నా ఎజెండా. అని నవీన్ అన్నారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వం పై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు..అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారన్నారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు అన్నారు. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తా అని నవీన్ యాదవ్ అన్నారు.
Also Read : కర్మ వదిలిపెట్టదు.. BRS ఓటమిపై కవిత సంచలన ట్వీట్!
Naveen Yadav : నవీన్ యాదవ్ అనే నేను... విజయం తర్వాత నవీన్ కీలక వ్యాఖ్యలు
భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్ యాదవ్ అన్నారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్నారు.
Naveen Yadav