Jubilee Hills By Election Result : జూబ్లీహిల్స్ విక్టరీ.. నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘనవిజయం సాధించారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కాగా నవీన్‌ యాదవ్‌ గెలుపుతో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు మొదటి విజయం సాధించినట్లయింది.

New Update
FotoJet (93)

Minister Post To Naveen Yadav|

Jubilee Hills By Election Result : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘనవిజయం సాధించారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కాగా నవీన్‌ యాదవ్‌ గెలుపుతో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు మొదటి విజయం సాధించినట్లయింది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ లో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా దక్కలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గణేష్‌ విజయం సాధించాడు. కాగా ఈ ఉప ఎన్నికల్లో రాజధాని నగరం నుంచి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించడంతో ఆ పార్టీలో జోష్‌ పెరిగింది.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి నవీన్‌యాదవ్‌ గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చేఅవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. --ఇప్పటికే ప్రజల్లో నవీన్ యాదవ్ కు మంచి గుర్తింపు ఉండటంతో పాటు నగరం నుంచి గెలిచిన ఎమ్మె్ల్యేగా, బీసీ కూడా కావడంతో మంత్రి పదవి కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా మైనార్టీ కోటాలో ఇటీవలె అజారుద్దీ్‌న్‌కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం , --కేబినెట్ లో ఇంకా రెండు మంత్రి పదవులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో --మంత్రి పదవుల రేసులో నవీన్ యాదవ్ పేరు పరిగణాలోకి తీసుకోవాలనికోరుతున్నారు --నవీన్ యాదవ్ కు హోం మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. కాగా రేవంత్‌ రెడ్దా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

#Congress Party #jubilee hills congress naveen yadav #jubilee hills by elction #Jubilee Hills assembly election 2025
Advertisment
తాజా కథనాలు