🔴Bihar Assembly Election 2025 Results: బిహార్‌ కౌంటింగ్‌.. లైవ్ అప్‌డేట్స్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తోంది. 38 జిల్లాల్లో 243 అసెంబ్లీ సీట్లు రెండు విడతలలో పోలింగ్ జరిగాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీహార్‌లోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

By Lok Prakash & Manoj Varma
New Update
Bihar Assembly Election 2025 Results

Bihar Assembly Election 2025 Results

Bihar Assembly Election 2025 Results: బీహారీల ఓటు ఎటువైపు? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

బీహార్ లో మరి కొద్ది సేపటిలో ఫలితాల లెక్కింపు మొదలవనుంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

bihar (1)

1951 తర్వాత బీహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 67.13 శాతం పోలింగ్‌ తో బీహారీలు రికార్డ్ సృష్టించారు. ఇక్కడ ఎన్నికలు మొదట నుంచి అందరి దృష్టీ ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి కావాలా? ఆటవిక పాలనా? అంటూ ఎన్డీయే ప్రచారం చేసింది. ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠ్‌బంధన్‌ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపించాయి.

రెండు దశల్లో పోలింగ్..

బీహార్ లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 122 సీట్లు రావాల్సిందే. బీహార్ లో మొత్తం 7.45 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3.92, స్త్రీలు 3.50 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ రెండు విడతల్లో ఎన్నికలు సాగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది ఓటేశారు. మొదటి దశ పోలింగ్ నవంబరు 6న.. 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. 1314 మంది అభ్యర్ఘథులు బరిలో నిలుచున్నారు. మొదటి దశలో 65 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో దశ నవంబర్11న 112 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 3. 70 కోట్ల మంది ఓటర్లు ఓటు వేశారు. 1302 మంది అభ్యర్థులు పోటీ చేయగా..69 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది.

పార్టీలు, అభ్యర్థులు..

ఎన్డీయే కూటమిలో జేడీయూ 101, బీజేపీ 101, లోక్‌ జన్‌శక్తి (రాంవిలాస్‌) 28, హిందుస్థానీఅవామ్‌ మోర్చా 06, రాష్ట్రీయ లోక్‌మోర్చా ఆర్‌ఎల్‌ఎం 06 స్థానాల్లో పోటీ చేశాయి. మఢౌరాలోలోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌) అభ్యర్థి సీమా సింగ్‌ నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్‌ కుమార్‌కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది. ఇక మహాగఠ్‌బంధన్‌ కు సంబంధించి ఆర్జేడీ 143, కాంగ్రెస్‌ 61, సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ 20, వికాస్‌శీల్ ఇన్సాన్‌ పార్టీ 12, సీపీఐ 09, సీపీఎం 04, ఇండియన్‌ ఇన్‌క్లూజివ్‌ పార్టీ 03, జనశక్తి జనతాదళ్‌ 01, స్వతంత్రులు 02 పోటీ చేశారు. ఇతరుల్లో జన్ సురాజ్‌ పార్టీ 238, బీఎస్పీ 130, ఆప్‌ 121, ఏఐఎంఐఎం 25, రాష్ట్రీయ లోక్జనశక్తి 25, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం) 25 తదితర పార్టీలు బరిలో ఉన్నాయి. వీటల్లో తేజస్వీ యాదవ్‌- ఆర్జేడీ (రాఘోపుర్‌); సామ్రాట్‌ చౌదరీ- భాజపా (తారాపుర్‌); విజయ్‌ కుమార్‌ సిన్హా- భాజపా (లఖిసరాయ్‌); మైథిలీ ఠాకుర్‌- భాజపా (అలీనగర్‌); ప్రేమ్‌ కుమార్‌ - భాజపా (గయా టౌన్‌); తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌- జేజేడీ (మహువా); బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌- జేడీయూ (సుపౌల్‌); తార్‌కిశోర్‌ ప్రసాద్‌- భాజపా (కఠిహార్‌); రాజేశ్‌ కుమార్‌ - కాంగ్రెస్‌ (కుటుంబ) కీలక స్థానాలుగా ఉన్నాయి.

  • Nov 14, 2025 21:39 IST

    Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్‌ కుమార్ ఎవరు ?

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.

     

    Tejashwi Yadav Wins Raghopur After Nailbiter In RJD's Safest Seat
    Tejashwi Yadav Wins Raghopur After Nailbiter In RJD's Safest Seat

     



  • Nov 14, 2025 20:15 IST

    Bihar Elections: ఎన్డీయేకు రవీంద్ర జడేజాగా నిరుపించుకున్న చిరాగ్‌ పాస్వాన్

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిరాగ్‌ పాస్వాన్ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్‌ విలాస్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

     

    Chirag Paswan plays role as NDA's Ravindra Jadeja
    Chirag Paswan plays role as NDA's Ravindra Jadeja

     



  • Nov 14, 2025 20:14 IST

    Bihar Elections: ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించే 50% ఫార్ములా.. అదేంటో తెలుసా?

    ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది.

     

    PM Modi
    PM Modi

     



  • Nov 14, 2025 20:13 IST

    PM Modi: జంగిల్‌రాజాకు ఎంట్రీ లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్‌ బిహార్‌ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.

     

    PM Modi Key Comments on NDA Victory in Bihar Elections
    PM Modi Key Comments on NDA Victory in Bihar Elections

     



  • Nov 14, 2025 19:07 IST

    సుపరిపాలన గెలిచిందిల: ప్రధాని మోదీ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయన్నారు. ఈ విజయం బిహార్ అభివృద్ధికి మరింత శక్తినిస్తుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జంగల్‌రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఈ విజయం 'వికసిత్ బిహార్'పై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిదన్నారు.

    PM Modi



  • Nov 14, 2025 19:06 IST

    బీహార్ కౌంటింగ్..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వెలువడింది. కూటముల వారీగా విజయాలు సంఖ్య చూసుకుంటే..

    NDA: గెలుపు 173, ఆధిక్యం 33. MGB: గెలుపు 26, ఆధిక్యం 5. Others: గెలుపు 4, ఆధిక్యం 2 గా కొనసాగుతున్నాయి. ఇక వీఐపీ ఒక్కచోటకూడా విజయం సాధించలేదు. మహిళలకు ఎన్డీయే డబ్బులు పంచడమే తమ పార్టీ ఓటమికి కారణమని వీఐపీ వ్యవస్థాపకుడు ముకేశ్‌ సహానీ ఆరోపించారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

     



  • Nov 14, 2025 19:05 IST

    మాట నిలబెట్టుకుంటాడా..PK రాజకీయ సన్యాసం?

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ జాన్ సూరజ్ పార్టీ (JSP) ఆశలు అడియాసలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ 0-5 సీట్లు గెలుస్తాడని అంచనా వేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ప్రశాంత్ కిషోర్ సైతం పోటీకి దగ్గరగా లేరు. అయితే ఎన్నికల ప్రచారంలో జనతాదళ్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదని సవాల్ చేశాడు. ఒకవేళ తాను చెప్పింది జరగకపోతే పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుంటానన్నారు. కానీ JDU ప్రస్తుతం 84 సీట్లతో దూసుకుపోతుండగా ప్రశాంత్ మాట నిలబెట్టుకుంటాడా? లేదా? అనే చర్చనీయాంశమైంది. 



  • Nov 14, 2025 18:10 IST

    Bihar Elections: హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత

    బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

    Jailed JD(U) leader Anant Singh wins by over 28,000 votes
    Jailed JD(U) leader Anant Singh wins by over 28,000 votes

     



  • Nov 14, 2025 16:19 IST

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది..

    ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 29 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అయితే ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్‌ వెనకంజలో ఉన్నారు. రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్‌ కుమార్‌ కంటే దాదాపు 5 వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.



  • Nov 14, 2025 16:08 IST

    కాంగ్రెస్‌కు కొత్త వ్యూహాలు అవసరం: డీకే శివకుమార్‌

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన ఏ ఆదేశాన్నైనా తాము అంగీకరిస్తామన్నారు. భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాన్ని రూపొందించడానికి దీనిని ఒక పాఠంగా ఉపయోగించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని శివకుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మరింత బలంగా పుంజుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు. 



  • Nov 14, 2025 15:27 IST

    గెలిచేవరకు మాస్క్ తీయనని.. ఓటమి చవిచూసి..!

    బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవరకు మాస్క్‌ తీయనని చెప్పిన ప్లూరల్స్ పార్టీ చీఫ్‌ పుష్పమ్ ప్రియాచౌదరీ.. పరాజయం పాలయ్యారు. దర్భంగా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు.

    Pushpam Priya Choudhary



  • Nov 14, 2025 14:55 IST

    ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యుత్‌.. తేజస్వీకి షాక్ ఇచ్చిన బీహారీలు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 37 స్థానాల్లోనే ముందంజలో ఉంది.

     

    NDA Touches 200 Mark in bihar assembly elections
    NDA Touches 200 Mark in bihar assembly elections

     



  • Nov 14, 2025 13:43 IST

    ఎన్డీయే విజయ రథం

    • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే రెండు వందల స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
    • మహాఘట్‌ బంధన్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేయలేకపోయింది.
    • జన్‌ సురాజ్‌కి సున్నా లీడ్స్.
    • బిహార్‌ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు.
    • జేడీయూ గత ఎన్నికలతో పోలిస్తే మెరుగైన స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది.



  • Nov 14, 2025 13:06 IST

    సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ..



  • Nov 14, 2025 11:45 IST

    Bihar Elections Votes Counting Live

    • బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యాన్ని సాధించింది.

    • మొత్తం 190 స్థానాల్లో అధికార కూటమి ముందంజలో ఉంది.

    • ఎక్కువ సీట్లలో జేడీయూ లార్జెస్ట్ పార్టీ.

    • జేడీయూ-బీజేపీ-మిత్రపక్షాలు ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్నాయి.

    • ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.



  • Nov 14, 2025 11:11 IST

    Bihar Elections Votes Counting Live

    • 190 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది.

    • 50 సీట్లలో మహాఘట్‌ బంధన్‌ ముందంజలో ఉంది.

    • విపక్ష కూటమికి భారీ ఎదురుదెబ్బ.

    • ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    • ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌ సురాజ్‌ ప్రభావం లేదు.



  • Nov 14, 2025 10:47 IST

    Bihar Elections Votes Counting Live

     

    • 175 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది.

    • ఇది గత ఎన్నికల కంటే 55 సీట్లు ఎక్కువ.

    • 59 స్థానాల్లో మహాఘట్‌ బంధన్‌ లీడ్‌లో ఉంది.

    • గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే విపక్ష కూటమి 51 సీట్లు వెనకంజలో ఉంది.

    • ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యం చూపుతున్నారు.

    • ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌కు ఏ ప్రభావం లేదు.



  • Nov 14, 2025 10:36 IST

    Bihar Elections Votes Counting Live

    • రాఘోపూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ 893 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

    • మహువాలో జేడీయూ నేత తేజ్ ప్రతాప్ వెనకంజలో కొనసాగుతున్నారు.

    • రఘునాథ్‌పూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి ఒసామా షాహబ్ ఆధిక్యంలో ఉన్నారు.

    • దానాపూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి రీత్లాల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.

    • భోజ్‌పూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ చాప్రా ఆధిక్యంలో ఉన్నారు.



  • Nov 14, 2025 10:18 IST

    బీహార్ ప్రజలు మోడీ, నితీష్‌ను నమ్మారు: బీజేపీ అధికార ప్రతినిధి..



  • Nov 14, 2025 10:12 IST

    Bihar Assembly Election 2025 Results: ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది: బీజేపీ బీహార్ అధ్యక్షుడు.



  • Nov 14, 2025 09:44 IST

    బీహార్‌లో ఎన్డీయే హవా

     

    • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా
    • మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటేసిన అధికార కూటమి
    • 150కి పైగా స్థానాల్లో ఆధిక్యం
    • 75కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో మహాఘట్‌బంధన్‌



  • Nov 14, 2025 09:32 IST

    బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు..



  • Nov 14, 2025 09:19 IST

    ఆధిక్యంలో ఎన్డీయే..

    • బీహార్ కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది

    • కౌంటింగ్ కొనసాగుతోంది

    • ఎన్డీయే: 134 స్థానాల్లో ఆధిక్యం

    • మహాఘట్‌బంధన్: 66 స్థానాల్లో ఆధిక్యం

    • జన్ సూరజ్: 3 స్థానాల్లో ఆధిక్యం



  • Nov 14, 2025 09:09 IST

    బీహార్ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్.. ఆధిక్యంలో ఎన్డీయే

    • ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ 122 దాటింది, అధికారంలోకి రావచ్చని అంచనా
    • ఎన్డీయే 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది
    • ఆర్జేడీ కూటమి కేవలం 65 స్థానాలకే పరిమితం
    • ఎన్డీయే కూటమిలో:

      • బీజేపీ: 59

      • జేడీయూ: 54

      • మిగతా స్థానాల్లో మిత్రపక్షాలు ఆధిక్యం

    • ఆర్జేడీ కూటమి లో:

    • ఆర్జేడీ: 43

    • కాంగ్రెస్: 11

    • లెఫ్ట్ పార్టీలు: 10 స్థానాల్లో లీడ్



  • Nov 14, 2025 08:42 IST

    తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజ..

    మహువా నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజ..



  • Nov 14, 2025 08:42 IST

    మంచి పాలన తిరిగి వస్తోంది: జేడీయూ



  • Nov 14, 2025 08:39 IST

    Bihar Assembly Election 2025 Results:

    • ఎర్లీ లీడ్స్‌లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజ
    •  30 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం 
    • 20 స్థానాల్లో మహాఘట్‌బంధన్ ఆధిక్యం
    • మహువాలో తేజ్ ప్రతాప్ వెనకంజలో
    • శివాన్‌లో బీజేపీ అభ్యర్థి మంగళ్‌పాండే ముందంజ
    • అలీపూర్‌లో మైథీలీ ఠాకూర్ ఆధిక్యం
    • తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌద్రీ ముందంజ
    • రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఆధిక్యంలో



  • Nov 14, 2025 08:29 IST

    పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

     

    • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ
    • రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ముందంజ
    • మరికాసేపట్లో ఈవీఎంల లెక్కింపు ప్రారంభం



  • Nov 14, 2025 08:28 IST

    Bihar Assembly Election 2025 Results:

    • బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

    • పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు జరుగుతోంది

    • 56 నియోజకవర్గాల్లో ఎన్డీయే భాగస్వామ్యాలు ముందంజలో

    • 29 స్థానాల్లో మహాఘట్‌బంధన్‌కు ఆధిక్యం

    • ప్రశాంత్ కిషోర్‌ జన్ సురాజ్‌ రెండు చోట్ల ముందంజ

    • అలీపూర్‌లో మైథీలీ ఠాకూర్ ముందంజలో

    • తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ మౌర్యకు ఆధిక్యం

    • రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ముందంజలో



  • Nov 14, 2025 08:23 IST

    ఎన్టీఏ 28, MGB 17 స్థానాల్లో ఆధిక్యం!



  • Nov 14, 2025 08:23 IST

    పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ ఆధిక్యం!



  • Nov 14, 2025 07:31 IST

    మహాగఠ్‌బంధన్ ప్రధాన ప్రచారాంశాలు, హామీలు

    • ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మెరుగుదలపై దృష్టి
    • ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల దోపిడీ ఆరోపణలు, వలసలు, నీతీశ్ ప్రభుత్వంపై వ్యతిరేక భావనల ప్రస్తావన
    • ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం హామీ
    • పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంపై వాగ్దానం
    • మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటింపు



  • Nov 14, 2025 07:30 IST

    ఎన్డీయే ప్రధాన ప్రచారాంశాలు, హామీలు

    • అభివృద్ధి, సంక్షేమం, శాంతి-భద్రతలు, మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి
    • నీతీశ్ చేసిన మంచి పాలన, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాల ప్రస్తావన
    • లాలూ హయాంలో జంగిల్‌రాజ్‌.. అవినీతి ఆరోపణలు
    • యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాల భరోసా
    • కోటి మహిళలను “లఖ్‌పతి దీదీ”లుగా తీర్చిదిద్దే కార్యక్రమం
    • రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు లక్ష్యం



  • Nov 14, 2025 07:26 IST

    Bihar Assembly Election 2025 Results: ప్రధాన అంశాలు

    • ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

    • ఓట్ల దోపిడీపై వచ్చిన ఆరోపణలు

    • పెరుగుతున్న నిరుద్యోగం

    • విస్తృత స్థాయిలో వలసలు

    • అవినీతి సమస్య

    • అభివృద్ధిలో ఉన్న వెనుకబాటు

    • శాంతి–భద్రతలపై ఆందోళనలు



  • Nov 14, 2025 07:25 IST

    కీలక సీట్లు ఇవే..

    • తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) – రాఘోపుర్
    • సామ్రాట్ చౌదరీ (బీజేపీ) – తారాపూర్
    • విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ) – లఖిసరాయ్
    • మైథిలీ ఠాకుర్ (బీజేపీ) – అలీనగర్
    • ప్రేమ్ కుమార్ (బీజేపీ) – గయా టౌన్
    • తేజ్ ప్రతాప్ యాదవ్ (జేజేడీ) – మహువా
    • బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ) – సుపౌల్
    • తార్కిశోర్ ప్రసాద్ (బీజేపీ) – కఠిహార్
    • రాజేశ్ కుమార్ (కాంగ్రెస్) – కుటుంబ



  • Nov 14, 2025 07:24 IST

    2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వివరాలు:

    ఎన్డీయే మొత్తం సీట్లు: 125

    • బీజేపీ: 74
    • జేడీయూ: 43
    • వీఐపీ: 4
    • హెచ్‌ఏఎం: 4

    మహాఘట్‌బంధన్ మొత్తం సీట్లు: 110

    • ఆర్జేడీ: 75
    • కాంగ్రెస్: 19
    • సీపీఐ(ఎంఎల్): 12
    • సీపీఐ: 2
    • సీపీఎం: 2

    ఇతరులు: 8

    • ఏఐఎంఐఎం: 5
    • బీఎస్పీ: 1
    • ఎల్‌జేపీ: 1
    • స్వతంత్రులు: 1



  • Nov 14, 2025 07:22 IST

    బిహార్‌ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌

    • 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు
    • 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే భారీగా పోలింగ్‌
    • దాదాపు 67.13 శాతం పోలింగ్‌ నమోదు
    • అందుకే విజయంపై ఉత్కంఠ



  • Nov 14, 2025 07:18 IST

    కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ



  • Nov 14, 2025 07:18 IST

    రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదు



  • Nov 14, 2025 07:16 IST

    ఎన్డీయే కూటమిలో హెచ్‌ఏఎం, రాష్ట్రీయ లోక్‌మోర్చా..



  • Nov 14, 2025 07:16 IST

    ఎన్డీయే కూటమిలో బీజేపీ , జేడీయూ, ఎల్జేపీ (రామ్‌విలాస్‌)..



  • Nov 14, 2025 07:15 IST

    అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ మధ్య ప్రధాన పోరాటం



  • Nov 14, 2025 07:15 IST

    ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్య 122



  • Nov 14, 2025 07:15 IST

    మొత్తం 243 స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్



  • Nov 14, 2025 07:15 IST

    38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు



  • Nov 14, 2025 07:15 IST

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం



Advertisment
తాజా కథనాలు