World Cup 2023:మనగడ్డ మీద మనమే తోపులం..మనల్ని ఓడించడం కీవీస్ తరం కాదు

New Update
World Cup 2023:మనగడ్డ మీద మనమే తోపులం..మనల్ని ఓడించడం కీవీస్ తరం కాదు

2019లో వరల్డ్ కప్ లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ లో తలపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. అప్పుడు మనల్ని కీవీస్ జట్టు చిత్తుగా ఓడించింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాని టీమ్ ఇండియా గట్టి పట్టదుల ఉంది. మా ఆట మేము ఆడతాం...గెలుపోటములు మన చేతుల్లో ఉండవు అని పైకి చెబుతున్నా సెమీస్ ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. భారత ప్రజలు కూడా దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు.

Also Read:గాజా మీద హమాస్ పట్టుకోల్పోయింది-ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

ప్రతీ ఆటకు ట్రాక్ రికార్డ్ ఉంటుంది. గతంలో ఎన్నిసార్లు ఆడారు...ఎవరు గెలిచారు లాంటివి కొత్త మ్యాచ్ లు ముందు చర్చకు వస్తాయి. ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ రేపు జరగబోతోంది. దీనిబట్టి ఇరు జట్లు గతంలో ఆడిన మ్యాచ్ లను బేరీజు వేయడం మొదలుపెట్టారు అందరూ. 2020 నుంచి భారత్, కీవీస్ టీమ్ ల మధ్య జరిగిన పది మ్యాచ్ లను తీసుకుంటే....పదింటిలో 4 మ్యాచ్‌లు మనం గెలిస్తే...4 మ్యాచ్‌లు న్యూఇలాండ్ జట్టు గెలిచింది. మరో రెండు ఫలితం తేలలేదు. ఇక్కడ ఇద్దరూ సమంగానే ఉన్నా...ఇందులో ఇండియాకు కలిసొచ్చే పాయింట్ ఒకటి ఉంది. న్యూజిలాండ్ గెలిచిన 4 మ్యాచ్ లో వాళ్ళ దేశంలో జరిగినవి. మనం గెలిచిన నాలుగు మ్యాచ్ లో మన దేశంలో జరిగినవి. ప్రస్తుతం వరల్డ్ కప్ భారత్‌లో జరగుతోంది. అంటే ట్రాక్ రికార్డ్ ను బట్టి ఫలితం మనకే ఫేవర్ గా ఉంది. మనగడ్డ మీద కీవీస్ మనల్ని ఓడించడం కష్టం అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

అందులోనూ మనవాళ్ళు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సెమీస్ లో న్యూజిలాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. లీగ్‌లో కూడా న్యూజిలాండ్ ను ఓడించింది. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కీవీస్ జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఒక్క మ్యాచ్ తప్ప అన్నింటిలో గెలిచి సెమీస్ కు వచ్చింది కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.

Also Read:సెమీస్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడు..రేపటి భారత తుది జట్టు ఇదే..

Advertisment
తాజా కథనాలు