India vs New Zealand Semi Final: ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపు మొదటి సెమీస్ మ్యాచ్ జరగబోతోంది. భారత్-న్యూజిలాండ్ ఇందులో తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు తొమ్మిది గెలిచిన భారత్.. అదే జోరును కివీస్‌పై కొనసాగించి గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ భావిస్తోంది. దీనిబట్టి రేపు ఇరు టీమ్ ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..India vs New Zealand :సెమీస్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడు..రేపటి భారత తుది జట్టు ఇదే..
లీగ్ మ్యాచ్ లు అయిపోయాయి. భారత్ రేపు న్యూజిలాండ్‌తో మొదటి సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రస్తుత జట్టులోంచి ఒకరిని తీసేసి స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను బరిలోకి దించాలనుకుంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
Translate this News: