యుద్ధం మొదలై చాలా రోజులు అవుతున్నా…అమాయక ప్రజలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నా హమాస్, ఇజ్రాయెల్ రెండూ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. వైమానిక, భూదాడులను కూడా చేస్తూ గాజాను ఆక్రమించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ గాజాలో హమాస్ నియంత్రణ కోల్పోయింది అని వ్యాఖ్యానించారు. హమాస్ ఉగ్రవాదులు దక్షిణం వైపుకు పారిపోతున్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆధారానలు మాత్రం ఆయన చూపించలేదు. యోవ్ గల్లంట్ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రధాన టీవీ స్టేషన్లలో అన్నింటిలో ప్రసారమైంది.
పూర్తిగా చదవండి..Israel-Hamas war:గాజా మీద హమాస్ పట్టుకోల్పోయింది-ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నెలరోజులుగా కొనసాగుతోంది. హమాస్‌ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గాజా మీద హమాస్ పట్టు కోల్పోయిందని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్.
Translate this News: