World Cup 2023:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
ఇప్పటివరకూ ఎలా ఆడామో అలానే ఆడితే సరిపోతుంది అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ అంటుంటే..మేము అన్నింటికీ అలవాటు పడిపోయాం, అండర్ డాగ్స్ గా ఉండడం మాకు కలిసి వస్తుంది అంటున్నాడు కీవీస్ కెప్టెన్ కేన్. మరికొన్ని గంటల్లో మొదలయ్యే సెమీస్ సమరానికి ఇద్దరూ సై అంటే సై అంటున్నారు.
వరల్డ్‌కప్‌లో సెమీస్ సమరానికి ఈ రోజు తెరలేవనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు టాసే హీరో కానుందా..టాస్ గెలిచిన వారే మ్యాచ్ గెలుస్తారా..ప్రీవియస్ మ్యాచ్‌ల హిస్టరీ చూస్తే ఇదే నిజమనిపిస్తుంది.
ప్రపంచకప్ లో అత్యంత ముఖ్యమైన స్టేజ్ కు వచ్చేశాం. ఈరోజు నుంచే సెమీస్ మొదలవుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. నేడు వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
క్రికెట్ లో ప్రతీ మ్యాచ్ కొత్తదే. వరుసగా ఎన్ని గెలిచినా ఓడిపోవడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. అందుకే టీమ్ ఇండియా మీద సెమీస్ ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కోచ్ రాహుల్ ద్రావిడ్. అయినా సరే పోరాడి గెలుస్తామని చెప్పారు.