🔴 Live Breakings: ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది.
CISF తాజాగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1161 పోస్టులను భర్తీ చేస్తోంది. పది పాసైన యువతి, యువకులు ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. బిలాస్పూర్ డివిజన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 835 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారంపై TGPSC స్పందించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయడానికి మొత్తం 18,174 పోస్టులను విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.