/rtv/media/media_files/2025/03/13/ffF8JjUo5l3UztKnjIpU.jpg)
jharkhand constable recruitment physical fitness rule changed
కానిస్టేబుల్ అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇకపై రిక్రూట్‌మెంట్ సమయంలో 10 కి.మీ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ నియమాన్ని తాజాగా ప్రభుత్వం సవరణ చేసింది. దాని ప్రకారం.. 10 కి.మీ బదులుగా.. కేవలం 1600 మీటర్లు పరుగులు పెడితే చాలు. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?
కొత్త నిబంధనలు
జార్ఖండ్ క్యాబినెట్ ముఖ్యమైన సమావేశంలో.. సోరెన్ మంత్రి మండలి దాదాపు 31 ప్రతిపాదనలను ఆమోదించింది. అందులో అతి ముఖ్యమైన విషయం.. కానిస్టేబుల్ / ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలలో సవరణ చేశారు. దీంతో అభ్యర్థులు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం 10 కిలోమీటర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు.
Also Read: పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
జార్ఖండ్ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదన ప్రకారం.. రాష్ట్రంలో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం 10 కిలోమీటర్ల పరుగును రద్దు చేశారు. దీని స్థానంలో పురుష అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మహిళలు 1600 మీటర్ల పరుగును 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ ప్రతిపాదన ఆమోదంతో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది అతి పెద్ద ఉపశమనం అనే చెప్పాలి.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
12 మందికి పైగా మృతి
గత రిక్రూట్‌మెంట్ సమయంలో 12 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతోమంది అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు యువతకు ఉద్యోగాల పంపిణీ కాకుండా చావుబతుకుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
రిక్రూట్‌మెంట్ నియమాలు?
గతంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే.. పురుష అభ్యర్థులు గంటలో 10కిలోమీటర్లు పరుగులు పెట్టాలి. అదే సమయంలో మహిళలు 40 నిమిషాల్లో 5కిమీలు పరుగెత్తాల్సి ఉండేది. అయితే ఇప్పుడు నిబంధనల సవరణ వల్ల అభ్యర్థులు ఉపశమనం పొందవచ్చు.